5G Services In India : 5జీ సర్వీసులు భారత్‌ను ఎలా మార్చబోతున్నాయ్ ?

10 ఏళ్ల క్రితం నుంచే 5జీ నెట్‌వర్క్‌పై ప్రయోగాలు మొదలైనా.. మన దేశంలో ఆలస్యంగా సేవలు అందుబాటులోకి రాబోతున్నాయ్. ఇంతకీ 5జీ సేవలు ఏ దేశంలో ఎలా ఉన్నాయ్‌. సర్వీసులు మొదలైతే మన దేశంలో ఎలాంటి మార్పులు చూస్తాం.. 5జీ రేసులో ఆ ఒక్క విషయమే.. జియోను టాప్‌లో నిలబెట్టబోతోందా ?

5G Services In India : 5జీ సర్వీసులు భారత్‌ను ఎలా మార్చబోతున్నాయ్ ?

5G Services In India : 10 ఏళ్ల క్రితంనుంచే 5జీ నెట్‌వర్క్‌పై ప్రయోగాలు మొదలైనా.. మన దేశంలో ఆలస్యంగా సేవలు అందుబాటులోకి రాబోతున్నాయ్. ఇంతకీ 5జీ సేవలు ఏ దేశంలో ఎలా ఉన్నాయ్‌. సర్వీసులు మొదలైతే మన దేశంలో ఎలాంటి మార్పులు చూస్తాం.. 5జీ రేసులో ఆ ఒక్క విషయమే.. జియోను టాప్‌లో నిలబెట్టబోతోందా ?

కేవలం ఆరేళ్ల కింద లాంచ్ అయిన జియో… తక్కువ వ్యవధిలో ప్రపంచ రికార్డులను సృష్టించింది. జియోకు ప్రస్తుతం 45కోట్ల మందికి పైగా వినియోగదారులు ఉన్నారు. ఫ్యూచర్ టెక్నాలజి స్వీకరించడంలో.. వాటిని అన్‌లాక్ చేయడంలో జియో ఎప్పుడూ ముందు వరుసలో కనిపిస్తోంది. ఐతే 5జీ స్పెక్ట్రమ్‌ వేలంలో జియో టాప్‌ బిడ్డర్‌గా నిలవగా.. సర్వీసుల కోసం జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 15నే సర్వీసులు స్టార్ట్ చేయబోతున్నట్లు.. జియో బాసులు పరోక్షంగా మెసేజ్ ఇస్తున్నారు. 5G రోల్‌అవుట్‌తో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటామన్న ఆకాశ్‌ అంబానీ మాటలు.. నెక్ట్స్‌ జనరేషన్ సర్వీసులు ఇప్పటికిప్పుడు అందించేందుకు జియో సిద్ధంగా ఉందన్న సంకేతాలు వినిపిస్తోంది..

4జీతో టెక్నాలజీని పరుగులు పెట్టించిన జియో.. ఇప్పుడు 5జీ రేసులోనూ టాప్‌గా నిలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయ్. 7వందల మెగాహెర్ట్జ్‌ బ్యాండ్ స్పెక్ట్రమ్‌ కొనుగోలు చేసిన ఏకైక నెట్‌వర్క్ జియో ! మొత్తం 22 సర్కిల్స్‌లో ఈ బ్యాండ్‌ విడ్త్‌ సొంతం చేసుకుంది. యూరప్‌ దేశాలతో పాటు అమెరికాతో ఈ బ్యాండ్‌ను ప్రీమియం బ్యాండ్ అంటారు. ఈ బ్యాండ్‌లో డేటా హ్యాండ్లింగ్‌, కవరేజ్‌ అద్భుతంగా ఉంటుంది. 700 మెగాహెడ్ట్జ్ అనేది లో ఫ్రీక్వెన్సీ బ్యాండ్. ఇండోర్‌, ఔట్‌డోర్‌లో కవరేజ్ అద్భుతంగా ఉంటుంది. మాములుగా బిల్డింగ్‌ సెల్లార్‌లో చాలా నెట్‌వర్క్‌ సిగ్నల్స్ ఉండవ్‌. ఐతే అలాంటి ప్రాంతాలకు కూడా సిగ్నల్స్ చొచ్చుకొని వెళ్లడం.. 700 మెగాహెడ్ట్జ్‌ ప్రత్యేకత. అందుకే 5జీ రేసులో జియోను ఈ బ్యాండ్‌ గేమ్ చేంజర్‌గా నిలబెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

Also read : 5G..Jio : త్వరలోనే సాకారం కాబోతోన్న 5జీ కల..వేలంలో టాప్ బిడ్డర్‌గా జియో

ఇక టవర్‌ కవరేజీ కూడా దాదాపు పది కిలోమీటర్ల వరకు ఉంటుంది. దీంతో తక్కువ సెల్‌ఫోన్‌ టవర్‌లు ఏర్పాటు చేసుకుంటే చాలు. దీంతో ఖర్చు కూడా తగ్గుతుంది. ఇక 700 మెగాహెర్ట్డ్‌ బ్యాండ్‌తో.. పట్టణాలకు మాత్రమే కాకుండా గ్రామాలకు కూడా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. రిమోట్ ఏరియాల్లోనూ సర్వీసులు అందించే అవకాశం ఉంటుంది. 1800 మెగాహెర్ట్జ్‌, 900 మెగాహెర్ట్జ్‌ బ్యాండ్‌తో పోలిస్తే.. 700 మెగాహెర్ట్జ్‌లో డేటా ట్రాఫిక్ హ్యాండ్లింగ్ మరింత సులభంగా ఉంటుంది. ఈ పరిణామాలన్నీ జియోను 5జీ రేసులో టాప్‌లో నిలపడం ఖాయంగా కనిపిస్తోంది.

5జీ సర్వీసులు అందుబాటులోకి వస్తే.. కేవలం నెట్ స్పీడ్ మాత్రమే పెరుగుతుంది అనుకుంటే పొరపాటే ! హైస్పీడ్ కనెక్టివిటీ దేశ స్వరూపాన్నే మార్చోబోతంది. డౌన్‌లోడ్ స్పీడ్ కన్నా 10, 20 రెట్లు అధికంగా ఉంటుంది. 5జీ అందుబాటులోకి వస్తే.. ప్రతీ వస్తువూ ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. అంటే ఎక్కడో ఉండి.. ఇంట్లో టీవీని ఆఫ్ చేయడంలాంటివి అన్నమాట. ఇంట్లో ప్రతీ వస్తువుతో టెక్నాలజీ ముడి పడుతుందన్నమాట. డ్రైవర్ లెస్ కార్ల జమానా రావొచ్చు.. ట్రాన్స్‌పోర్టుకు సంబంధించి.. 5జీ సర్వీసులు గణనీయమైన మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. ఎలక్ట్రానిక్ వాహనాల వ్యవస్థ ఏర్పడి.. చార్జింగ్ స్టేషన్లు క్రియేట్ అయ్యే చాన్స్ ఉంది. 5జీ రాకతో ఎక్కువగా లాభపడేది ఆరోగ్యరంగమే ! టెలీ మెడిసిన్, ఆన్‌లైన్ కన్సల్టేషన్స్ భారీగా పెరుగుతాయ్‌. బటన్ నొక్కితే చాలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం అయిన సూచనలు చేసే డాక్టర్లు, నర్సులు కనిపిస్తారు. సిటీ స్కాన్స్, ఎమ్ఆర్ఐ లాంటి డేటాను.. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే క్షణాల్లో ట్రాన్స్‌మిట్ చేసే అవకాశం ఉంటుంది.

Also read : Xiaomi AR Glasses : డబుల్ కెమెరా సెటప్, OLED స్క్రీన్‌తో కొత్త స్మార్ట్ గ్లాసెస్.. ధర ఎంతంటే?

వ్యవసాయ రంగంలో.. 5జీ రాక తర్వాత సైంటిఫిక్ ఫార్మింగ్ టెక్నాలజీని తీసుకురావొచ్చు. పంట ఉత్పత్తిని పెంచవచ్చు. భూసార పరీక్షలు, వాటర్ మేనేజ్‌మెంట్, స్మార్ట్ వ్యవసాయం, పంట ఆరోగ్య పరిశీలన, డ్రోన్లతో వ్యవసాయం చేయొచ్చు. ఇలా అన్ని రంగాలు అభివృద్ధి చెందితే ఆర్థిక వ్యవస్థ కూడా పరుగులు పెట్టడం ఖాయం. అందుకే 5జీ అనేది టైమ్ అండ్ ఫేట్ ఛేంజర్.