ఫ్రెండ్లీ పోలీసింగ్: 5th క్లాస్ పిల్లాడి కంప్లైట్..రంగంలోకి దిగిన పోలీసులు

  • Published By: veegamteam ,Published On : November 28, 2019 / 11:21 AM IST
ఫ్రెండ్లీ పోలీసింగ్: 5th క్లాస్ పిల్లాడి కంప్లైట్..రంగంలోకి దిగిన పోలీసులు

5వ క్లాస్ చవివే పిల్లాడు క్లాస్ నోట్ బుక్ పేజిని చింపి దానిపై ఫిర్యాదు రాసి కేరళ కోజికోడ్ జిల్లాలోని మెప్పయూర్ పోలీసులకు  ఫిర్యాదు రాసి కంప్లైంట్ చేశాడు. దానిపై పోలీసులు స్పందించి వెంటనే రంగంలోకి దిగి విచారణ కూడా చేయటం వైరల్ గా మారింది. 

కోజికోడ్‌లోని ఎలింబిలాడ్ స్కూల్లో  అబిన్ 5వ క్లాస్ చదువుతున్నాడు. ఇటీవలే ఆబిన్, అతడి తమ్ముడూ ఓ సైకిల్ షాపులో తమ సైకిల్‌ను రిపేర్‌కు ఇచ్చారు. రోజులు గుడుస్తున్నా సైకిల్ రిపేర్ చేయలేదు. దీంతో అన్నదమ్ములిద్దరూ మెకానిక్ కు ఫోన్ చేసినా అతడు ఫోస్ లిప్ట్ చేయలేదు. ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేసినా..రేపుమాపు సాకులు చెబుతున్నాడు. 
 
దీంతో ఆబిన్‌కు కోపం వచ్చింది. ఏం చేయాలా.. అని ఆలోచించాడు. ఆ చిట్టి బుర్రకు ఓ ఐడియా వచ్చింది. వెంటనే స్కూల్ నోట్ బుక్ తీసుకున్నాడు. ఓ పేజి చింపాడు చకచకా కంప్లైంట్ రాసేసి  సోమవారం (నవంబర్ 25) మెప్పయూర్ పోలీస్ స్టేషన్‌లో ఇచ్చాడు. నా సైకిల్ రిపేర్ కోసం ఓ షాపు యజమానికి 200 రూపాయలు ఇచ్చానని.. రోజులు గడుస్తున్నా నా సైకిల్ రిపేరు కాలేదని లేఖలో చెప్పాడు. 

బుడతడి లెటర్ చూసిన పోలీసులు ముచ్చటపడ్డారు. చిన్నపిల్లాడు.. ఏదో తెలీక చేశాడని అనుకోలేదు.అబిన్ కంప్లైంట్‌కు రిజిస్టర్‌లో ఓ నెంబర్ కూడా కేటాయించారు. షాపు మెకానికర్ ని కలిసి అసలేం జరిగిందని ప్రశ్నించారు. తన కొడుకు పెళ్లి హడావిడిలో ఉండి సైకిల్ రిపేర్ కుదరలేదని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఆ తరవాత అబిన్ సైకిల్‌ను రిపేర్ చేసి ఇచ్చేశాడు. ఈ బుడతడి లెటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలైన ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు అంటే ఇదే అంటు నెటిజన్లు మెప్పయూర్ పీఎస్ పోలీసులపై  పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.