Air bags: కారులో తప్పకుండా 6 ఎయిర్ బ్యాగ్స్ ఉండాలట

ప్రపంచ ప్రమాణాకు తగిన విధంగా తనిఖీలు నిర్వహించి అందుకు తగినట్టుగా ఉన్న వాహనాలకు స్టార్ రేటింగ్ ఇచ్చేందుకు ‘‘భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రాం’’పై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు గడ్కరి వెల్లడించారు. తద్వారా మార్కెట్‌లో కొత్త వాహనం రాకముందే స్టాండర్ట్ మ్యాండేటరీ కింద క్రాష్-టెస్ట్‌లను నిర్వహించాల్సి ఉంటుందన్నారు. అయితే, కార్లలో అదనంగా మరో నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లు ఏర్పాటు చేయడం వల్ల కార్ల ధరలు పెరుగుతాయంటూ ఒక వర్గం కార్ల తయారీదారులు ప్రభుత్వం దృష్టికి తెచ్చినట్టు తెలుస్తోంది

Air bags: కారులో తప్పకుండా 6 ఎయిర్ బ్యాగ్స్ ఉండాలట

6 airbags mandatory in cars from October 1

Air bags: తప్పనిసరిగా ప్రతి కారులో ఆరు ఎయిర్ బ్యాగులు ఉండాలని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం స్పష్టం చేసింది. ఇది ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి అమలులోకి తీసుకువచ్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తోందట. ఈరోజు రాజ్యసభలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కార్లలో భద్రతా ఫీచర్స్‭ని మెరుగుపరిచేందుకు మరిన్ని ఎయిర్ బ్యాగులు ఏర్పాటు చేయాలని, ఈ మేరకు ఆటోమొబైల్స్ ఉత్పత్తిదారులను కోరాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం కార్లలో రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. అవి ముందు ఉంటాయి. అయితే వెనుక ఉండే వారి కోసం మరో నాలుగు ఎయిర్ బ్యాగులు ఉండే విధంగా ప్రతిపాదించినట్లు తెలిపారు. దేశంలో ఏటా లక్షకు పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రస్తుత ప్రతిపదన ద్వారా ప్రమాదాల్లో మరణాల సంఖ్యలను తగ్గించవచ్చని గడ్కరి అన్నారు.

ప్రపంచ ప్రమాణాలకు తగిన విధంగా తనిఖీలు నిర్వహించి అందుకు తగినట్టుగా ఉన్న వాహనాలకు స్టార్ రేటింగ్ ఇచ్చేందుకు ‘‘భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రాం’’పై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు గడ్కరి వెల్లడించారు. తద్వారా మార్కెట్‌లో కొత్త వాహనం రాకముందే స్టాండర్ట్ మ్యాండేటరీ కింద క్రాష్-టెస్ట్‌లను నిర్వహించాల్సి ఉంటుందన్నారు. అయితే, కార్లలో అదనంగా మరో నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లు ఏర్పాటు చేయడం వల్ల కార్ల ధరలు పెరుగుతాయంటూ ఒక వర్గం కార్ల తయారీదారులు ప్రభుత్వం దృష్టికి తెచ్చినట్టు తెలుస్తోంది. ప్రపంచంలోని వాహనాల్లో ఇండియాలోని వాహనాలు ఒక్క శాతమే అయినప్పటికీ, ప్రపంచ మరణాల్లో భారత్ మరణాల శాతం పదకొండుగా ఉందని, ప్రపంచంలోనే ఇది అత్యధిక శాతమని ఇటీవల వరల్డ్ బ్యాంక్ ఒక నివేదికలో పేర్కొంది.

Congress: రాహుల్, ప్రియాంక సహా కాంగ్రెస్ నేతల విడుదల