సెప్టిక్ ట్యాంకులో ఒకరితర్వాత మరొకరు ఏడుగురు దిగారు.. చనిపోయారు

  • Published By: madhu ,Published On : August 10, 2020 / 08:31 AM IST
సెప్టిక్ ట్యాంకులో ఒకరితర్వాత మరొకరు ఏడుగురు దిగారు.. చనిపోయారు

సెప్టిక్ ట్యాంకులో దిగి ఆరుగురు మరణించిన విషాద ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఒకరు దిగి బయటకు రాకపోవడంతో మరొకరు దిగారు..ఇలా ఆరుగురు చనిపోవడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. జార్ఖండ్ రాష్ట్రంలో డియోగడ్ జిల్లా దేవీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొన్ని రోజులుగా సెప్టిక్ ట్యాంకు నిర్మాణ పనులు జరుగుతున్నాయి.



2020, ఆగస్టు 09వ తేదీ ఆదివారం…పనులు చేస్తున్నారు. కూలీ ముర్ము మొదట ట్యాంకులోకి దిగాడు. ఎంత సేపటికి బయటకు రాలేదు. ఏమైంది అని కాంట్రాక్టర్ గోవింద్ మాంఝీ లోపలకు వెళ్లాడు. ఇతను వెళ్లన తర్వాత ఎమీ చప్పుడు లేదు. వెంటనే…మాంఝీ కొడుకులు బబ్లూ, లాలూ సెప్టిక్ ట్యాంకులోకి దిగారు.



తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన బ్రజేష్ చంద్ర బుర్నావాల్, మితిలేశ్ చంద్ర బర్నావాల్ లోపలకు వెళ్లారు. వీరు కూడా బయటకు రాకపోవడంతో ప్రమాదం ఏదో జరిగిందని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న అధికారులు..అక్కడకు చేరుకుని..జేసీబీ సహాయంతో సెప్టిక్ ట్యాంకు సమాంతరంగా గొయ్యి తవ్వారు.



లోపల ఒకరిపై ఒకరు పడి ఉన్నారు. వెంటనే వీరిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. కార్బన్ డయాక్సైడ్, మోనాక్సైడ్ విషపూరిత రసాయనాలు విడుదల కావడం, ఊపిరాడక మరణించారని డియోఘర్ డిప్యూటీ కమీషనర్ కమలేశ్వర ప్రసాద్ సింగ్ వెల్లడించారు. బాధిత కుటుంబాలను ఆదుకొంటామని, 10 కిలోల ఆహారపదార్థాలను అందించామని సునీల్ కుమార్ (సర్కిల్ ఆఫీసర్) వెల్లడించారు.