60 లక్షల మందిని సొంత ప్రాంతాలకు పంపించాము :  రైల్వే శాఖ

  • Published By: murthy ,Published On : June 9, 2020 / 02:04 PM IST
60 లక్షల మందిని సొంత ప్రాంతాలకు పంపించాము :  రైల్వే శాఖ

కరోనా లాక్ డౌన్ కారణంగా దేశంలోని  వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన సుమారు 60 లక్షల మందిని  ప్రత్యేక రైళ్ల ద్వారా  వారి వారి స్వస్ధలాలకు పంపించామని రైల్వే శాఖ ప్రకటించింది.  ఇందుకోసం  మే 1 వ తేదీ నుంచి 4,347 ప్రత్యేక రైళ్లు నడిపినట్లు తెలిపింది.  

కాగా ….  వలస కార్మికులపై సుప్రీం కోర్టు మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటికి దూరంగా ఇన్ని రోజులుగా పనిలేకుండా ఉన్న మిగిలిన వారిని  కూడా వారి సొంత రాష్ట్రాలకు 15రోజులుగా పంపాలని ఆదేశాలిచ్చింది. సుప్రీం కోర్టు వలస కార్మికుల అంశంపై విచారణ జరిపి 24గంటల్లోగా రైళ్లు ఏర్పాటు చేయాలని సూచించింది. 

కోర్టు ఆదేశాలు పాటించి రిజిస్ట్రేషన్ ప్రకారం.. వలస కార్మికులను గుర్తించాలని ఆదేశాలిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు స్కీం ప్రకారం.. వలస కార్మికులకు సాయం చేయాలని తెలిపింది. వలస కార్మికులను తిరిగి పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించింది.