రామ మందిర నిర్మాణం : 60శాతం పిల్లర్లు, బీమ్ లు రెడీ

అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. వివాదాస్పద 2.77 ఎకరాల భూమి హిందువులదే అని కోర్టు చెప్పింది. కోర్టు తీర్పుతో రామ మందిరం

  • Published By: veegamteam ,Published On : November 9, 2019 / 11:35 AM IST
రామ మందిర నిర్మాణం : 60శాతం పిల్లర్లు, బీమ్ లు రెడీ

అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. వివాదాస్పద 2.77 ఎకరాల భూమి హిందువులదే అని కోర్టు చెప్పింది. కోర్టు తీర్పుతో రామ మందిరం

అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. వివాదాస్పద 2.77 ఎకరాల భూమి హిందువులదే అని కోర్టు చెప్పింది. కోర్టు తీర్పుతో రామ మందిరం నిర్మాణానికి లైన్ క్లియర్ అయ్యింది. సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీరుపై విశ్వహిందూ పరిషత్ స్పందించింది. 

కోర్టు తీర్పుని స్వాగతిస్తున్నామని వీహెచ్ పీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ వర్మ తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం పాటించాలన్నారు. వెంటనే ఆలయ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా అలోక్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే 60శాతం పిల్లర్లు, బీమ్స్ పూర్తయ్యాయని తెలిపారు. 

ఇది సంతోషకరమైన రోజని.. 491 ఏళ్ల పోరాటానికి, అసంఖ్యాకమైన యుద్ధాలు, త్యాగాల అనంతరం దక్కిన విజయంగా తీర్పును అభివర్ణించారు అలోక్ వర్మ. సత్యం, న్యాయం పక్షాన సుప్రీం నిలిచిందని అన్నారు. 40 రోజులు, 200 గంటలకు సాగిన సుదీర్ఘ ప్రక్రియ ఇదని.. ప్రపంచ న్యాయస్థానాల తీర్పుల్లో గొప్పదన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు పండుగ జరుపుకోవలసిన సందర్భమిదని.. అయితే హిందువుల స్వభావ సిద్ధంగా మర్యాదస్తులని తెలిపారు. సంబరాలు ఎప్పుడూ ఉద్రిక్తతలకు తావివ్వకూడదని అన్నారు. ఇక్కడ ఎవరూ ఎవరినీ ఓడించలేదనే విషయం అందరూ గ్రహించాలన్నారు. శాంతి, సామరస్యాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. త్వరితగతిన కేంద్రం తదుపరి చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు

దేశ ప్రజలందరూ ఉత్కంఠగా ఎదురుచూసిన అయోధ్య భూ వివాదం కేసుకి సుప్రీంకోర్టు ఎండ్‌ కార్డ్‌ వేసింది. ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. 2.77 ఎకరాల వివాదాస్పద స్థలాన్ని రామ్‌లల్లా న్యాస్‌కు అప్పగిస్తూ శనివారం(నవంబర్ 9,2019) ఏకగ్రీవ తీర్పునిచ్చింది. అయోధ్య చట్టం కింద 3 నెలల్లో ప్రత్యేక ట్రస్టును ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. సున్నీ వక్ఫ్‌ బోర్డుకు అయోధ్యలోనే ఐదెకరాల అనువైన స్థలాన్ని కేంద్ర ప్రభుత్వంగానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ కేటాయించాలని… 1993లో కేంద్రం స్వాధీనం చేసుకున్న స్థలం నుంచి ఆ భూమిని కేటాయించవచ్చని సూచించింది. ఆలయ నిర్మాణాన్ని ట్రస్టు పర్యవేక్షించాల్సి ఉంటుందని, ఆ ట్రస్టులో నిర్మోహి అఖాడాకు ప్రాతినిధ్యం కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

మతవిశ్వాసాల ఆధారంగా తాము తీర్పు చెప్పడం లేదని.. సాక్ష్యాలు, ఆధారాలను పరిశీలించే భూమి హక్కులు ఎవరివన్నదానినే తేల్చుతున్నామంటూ తీర్పు కాపీలో స్పష్టంగా పేర్కొన్నారు సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్ రంజన్ గొగోయ్. పురా వస్తుశాఖ ఇచ్చిన నివేదికను ఈ తీర్పునకు ఆధారం చేసుకున్న సుప్రీంకోర్టు…  బాబ్రీ మసీదును ఖాళీ స్థలంలో కట్టలేదని అభిప్రాయపడింది. బాబ్రీ మసీదు కిందిభాగంలో గతంలో భారీ కట్టడం ఉండేదని పురావస్తు శాఖ నివేదిక ద్వారా తెలుస్తోందన్న సుప్రీంకోర్టు… ఆ కట్టడం ఆలయమన్న విషయంపై స్పష్టత లేదంది. అంతేకాదు.. రాముడు అయోధ్యలో జన్మించాడన్నదే హిందువుల విశ్వాసమన్న న్యాయస్థానం.. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదంది. అయితే.. హిందువుల ఆలయాన్ని కూల్చి బాబ్రీ మసీదును నిర్మించారనడానికి కూడా ఆధారాల్లేవని చెప్పింది.

1856కు ముందు వివాదాస్పద స్థలంలో నమాజ్ చేసినట్లు ఎలాంటి ఆధారాల్లేవని సుప్రీంకోర్టు తేల్చింది. ఆ తర్వాత.. వరండాలో హిందువుల ప్రార్థనలు, మసీదులో ముస్లింల నమాజ్‌ జరుగుతుండేవని అంది. ఏ సమయంలోనూ వివాదాస్పద స్థలం పూర్తిగా ముస్లింల ఆధీనంలో లేదని చెప్పింది. వెలుపలి వరండా పూర్తిగా హిందువుల ఆధీనంలో ఉన్నట్లు ఆధారాలున్నాయని అంది. లోపలి వరండాపైనే వివాదం నెలకొందని ఉందని… అయితే.. దీనిపై అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పు తప్పని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వివాదాస్పద స్థలాన్ని విభజించాలనుకోవడం పొరపాటు అని చెప్పింది.

రాజ్యాంగం ముందు అన్నివర్గాలు సమానమేనని… చట్టం ముందు అందరూ ఒక్కటేనని చెప్పిన సుప్రీంకోర్టు… అయోధ్య వివాదానికి శాశ్వత పరిష్కారాన్ని ఆశిస్తూ తీర్పును వెలువరించింది. స్థల హక్కుల కోసం నిర్మోహి అఖాడా, షియా వక్ఫ్ బోర్డు వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది.