Maharashtra : 60 వేల మందికి చుక్కలు చూపించిన పిల్లి..! ఏకంగా రూ.100 కోట్ల నష్టం..!!

మియావ్ మియావ్ అనుకుంటూ గోడలపై తిరిగే పిల్లి ఏకంగా 60వేలమందికి చుక్కలు చూపించింది. రూ.100 కోట్ల నష్టం జరగటానికి కారణమైంది.

Maharashtra : 60 వేల మందికి చుక్కలు చూపించిన పిల్లి..! ఏకంగా రూ.100 కోట్ల నష్టం..!!

60 Thousand Electricity Connection Cut And Rs.100 Crore Loss In Maharashtra Pune Urban Because Of A Cat

Rs. 100 crore loss because A Cat :  మియావ్ మియావ్ అనుకుంటూ గోడలపై తిరిగే పిల్లి ఏకంగా 60వేలమందికి చుక్కలు చూపించింది. రూ.100 కోట్ల నష్టం జరగటానికి కారణమైంది. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ ఎవ్వరికి తెలియదు అన్నట్లుగా ఓ పిల్లి ‘దూకుడు’కాస్తా 60వేల విద్యుత్ కనెక్షన్లు తెగిపోవటానికి కారణమైంది. అంతేకాదు ఏడు వేలమంది వ్యాపారులు చీకట్లో ఏం చేయాలతో తెలియక జరిగిందేంటో తెలియక నానా పాట్లు పడ్డారు.పిల్లి చేసిన ఘనకార్యానికి ఒకటి రెండు కాదు ఏకంగా రూ.100 కోట్లు నష్టం వాటిల్లింది..!! ఇంతకీ ఏమా పిల్లి ఘనకార్యం అంటే..

Al

మహారాష్ట్రలోని పుణె పట్టణ శివారున పింప్రీ – చించ్వడ్‌ ప్రాంతంలో ఏకంగా 60 వేల విద్యుత్తు కనెక్షన్లు తెగిపోయాయి. దీనికి కారణం ఓ పిల్లి.  ఈ పిల్లి చేసిన ఘనకార్యం అక్కడితో ఆగిపోలేదు..చించ్వడ్ ఏరియా పరిధిలోని పారిశ్రామిక ప్రాంతం భోసారిలో ఏకంగా ఏడువేల మంది వ్యాపారులు విద్యుత్తు అంతరాయం కలిగింది. దీంతో వారు నానా ఇబ్బందులు పడ్డారు. విద్యుత్ అంతరాయంతో వ్యాపారులకు రూ.వ100 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.

ఓ పిల్లి మహా ట్రాన్స్‌మిషన్‌ సబ్‌స్టేషనులోని ట్రాన్స్‌ఫార్మరు మీదికి ఎక్కింది. షార్ట్‌ సర్క్యూటుతో భోసారి, భోసారి ఎం.ఐ.డి.సి. (Industrial area), అకుర్ది ప్రాంతాల్లో 60 వేల మంది వినియోగదారులకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.

దీని గురించి కుటీర పరిశ్రమల సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ..‘మాకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఏం జరిగిందో తెలియదు. కానీ జరిగిన ఘటనపై విద్యుత్తుశాఖ మంత్రి స్పందించి తిరిగి విద్యుత్ సరఫరా అయ్యేలా చూడాలని కోరారు. పిల్లి చేసిన పనికి మరో మూడు రోజులపాటు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ అవకాశాలు కనిపించడం లేదు. చూశారా? ఓ పిల్లి ఎంత పనిచేసిందో..పిల్లి శాపాలకు ఉట్టి తెగిపోదు అనే సామెత బహుశా ఈ పిల్లిగారి విషయం మాత్రం ఫుల్ డిఫరెంట్ గా ఉంది. వేలాదిమందికి కరెంట్ కట్ చేసి చుక్కలు చూపెట్టిందీ పిల్లి..