చాక్లెట్ ఆశ చూపి.. ఐదేళ్ల చిన్నారిపై 60ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడి

చాక్లెట్ ఆశ చూపి.. ఐదేళ్ల చిన్నారిపై 60ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడి

60 years old man molestation: నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, జైలు శిక్షలు విధిస్తున్నా, ఉరి తీస్తున్నా, ఎక్ కౌంటర్ చేస్తున్నా.. కామాంధుల్లో మార్పు రావడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు మనుషులు మృగాళ్లలా మారిపోతున్నారు. చిన్న, పెద్ద అనే తేడా లేదు.. ఆడది కనిపిస్తే చాలు కామవాంఛలు తీర్చుకుంటున్నారు. వయసు మీద పడిన వారు కూడా పాడు పనులకు పాల్పడుతున్నారు. మనవరాలి వయసున్న పసిపిల్లలపై లైంగిక దాడులు చేస్తున్నారు. కర్నాటకలో అలాంటి దారుణమే జరిగింది.

కామంతో కళ్లుమూసుకుపోయిన 60ఏళ్లు వృద్ధుడు ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి యత్నించాడు. ఈ ఘటన ఛత్రకోడి హళ్లిలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వారికి ఐదేళ్ల కూతురుంది. రోజూ పాపను అంగన్ వాడీ కేంద్రం వదిలి పనులకు వెళ్తారు. కాగా, అదే గ్రామానికి చెందిన వృద్ధుడు తిమ్మప్ప… పాపపై కన్నేశాడు.

రోజులానే బుధవారం(ఫిబ్రవరి 24,2021) ఉదయం కూడా తమ ఐదేళ్ల చిన్నారిని అంగన్‌వాడీ కేంద్రంలో వదిలి పనులకు వెళ్లారు తల్లిదండ్రులు. సాయంత్రం అంగన్‌వాడీ కేంద్రం నుంచి బాలిక ఇంటికి చేరుకుంది. అప్పటికి ఇంకా తల్లిదండ్రులు రాలేదు. పాప ఒంటరిగా ఉంది. ఇదే అదనుగా.. తిమ్మప్ప పాప దగ్గరికి వెళ్లాడు. చాక్‌లెట్‌ ఇప్పిస్తానని చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు.

వృద్ధుడి చేష్టలతో చిన్నారి భయపడింది. గట్టిగా కేకలు వేసింది. దీంతో తిమ్మప్ప పాపను వదిలేశాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిమ్మప్పను అరెస్ట్‌ చేసిన పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ నీచుడిని కఠినంగా శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు.