Corona patients missing : 6వేల మంది కరోనా పేషెంట్లు మిస్సింగ్..హడలిపోతున్న బెంగళూరు వాసులు

బెంగళూరులో ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 6వేలమంది కరోనా పేషెంట్లు కనిపించకుండాపోయారు. దీంతో వారి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.

Corona patients missing : 6వేల మంది కరోనా పేషెంట్లు మిస్సింగ్..హడలిపోతున్న బెంగళూరు వాసులు

6000 Corona Patients Missing

6000 Corona patients missing : కరోనా పేషెంట్లు జైలునుంచి మిస్ అయ్యారనీ..చికిత్సా సెంటర్ నుంచి మిస్ అయ్యారనే వార్తలు వింటుంటాం. ఈ క్రమంలో బెంగళూరులో ఏకంగా 6వేలమంది కరోనా పేషెంట్లు మిస్ అయ్యారు. మిస్ అయ్యారు అంటే ఏ కరోనా కేర్ సెంటర్ నుంచో మిస్ అవ్వలేదు. కరోనా టెస్టులు చేయించుకుని తప్పుడు అడ్రస్ లు ఇచ్చి కనిపించకుండా పోయారు. రాంగ్ అడ్రస్సులు ఇచ్చి కరోనా టెస్టులు చేయించుకున్నారు. వాళ్లు ఇచ్చిన కాంటాక్ట్ ఫోన్ నంబర్లు కూడా పనిచేయకపోవటంతో టెస్టులు చేసిన తరువాత ఆయా వ్యక్తులకు పాజిటివ్ అని మెసేజ్ చేయటానికి కూడా లేకపోయింది. దీంతో ఆ మెసేజ్ లు వారికి ఎలా అందించాలో తెలీక టెస్ట్ సెంటర్ల వాళ్లు తలలు పట్టుకున్నారు. దీంతో పోలీసులకు ఈ విషయం చెప్పటంతో వారి కోసం గాలిస్తున్నారు పోలీసులు.

కరోనా సెకండ్ వేవ్ బెంగళూరుపై పంజా విసిరింది. దీంతో లాక్ డౌన్ ప్రకటించారు. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా కూడా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. భారీ సంఖ్యలోనే కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా పేషెంట్లతో కోవిడ్ సెంటర్లు, ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. మరోపక్క కరోనా సోకిన వారు ఐసొలేషన్ లో ఉండకుండా బైట తిరిగేస్తుంటంతో కరోనా తీవ్రత భారీగానే పెరుగుతోంది. ఈ క్రమంలో బెంగళూరులో సుమారు 6వేల మంది కరోనా పేషెంట్లు కనిపించకుండా పోవడం కలకలం రేపుతోంది. ఈ వార్తతో నగరవాసులు భయాందోళనలకు గురి చేస్తోంది. మన పక్కనే ఉన్నవారు కరోనా పాజిటివ్ వారా ఏంటీ అనే భయాందోళన కలుగుతోంది నగరవాసులకు.

కాగా..గత కరోనా ఫస్ట్ వేవ్ లో కూడా బెంగళూరులో దాదాపు 10 వేల మంది కరోనా పేషెంట్లు కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు కూడా వారి ఆచూకీ కనిపెట్టలేకపోయారు పోలీసులు. ఈ క్రమంలో ఈ సెకండ్ వేవ్ లో కూడా ఇదే జరిగింది. కరోనా పరీక్షలకు వచ్చిన వారు రాంగ్ అడ్రస్సులు. రాంగ్ ఫోన్ నెంబర్లు ఇస్తుండటంతో రిపోర్టు గురించి వారికి ఎలా తెలపాలో అర్థం కాకుండా ఉంది. వీరిని వెతికేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నా… ఏమాత్రం ఫలితం దక్కడం లేదు. మరి ఈ సెకండ్ వేవ్ లో అయినా రాంగ్ అడ్రస్సులు ఇచ్చినవారిని కనిపెడతారో లేదో చూడాలి.