ఢిల్లీలో 605 ప్రైవేట్ స్కూల్స్ గుర్తింపు రద్దు!

  • Published By: veegamteam ,Published On : May 16, 2019 / 03:47 PM IST
ఢిల్లీలో 605 ప్రైవేట్ స్కూల్స్ గుర్తింపు రద్దు!

ఢిల్లీలోని సుమారు 605 ప్రైవేట్ పాఠశాలల గుర్తింపు రద్దు కానుంది. రూ.5 లక్షల పర్యావరణ అపరాధ రుసుం చెల్లించకపోవడంతో వాటి గుర్తింపు రద్దు చేయనున్నారు. పాఠశాల ప్రాంగణంలో వర్షపు నీటి నిల్వ ప్లాంట్ నిర్మించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సూచనలు చేసింది. ఆ ప్లాంట్స్ ను ఏర్పాటు చేయని పాఠశాలలు తమ గుర్తింపును కోల్పోనున్నాయి. 

ఢిల్లీలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల ప్రాంగణంలో వర్షపు నీటి నిల్వ ప్లాంట్ నెలకొల్పాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2017లో ఆదేశించింది. రెండు నెలల్లో స్వంత ఖర్చుతో ఏర్పాటు చేయాలని తెలిపింది. ఇచ్చిన గడువులోపు వర్షపు నీటి నిల్వ ప్లాంట్ ఏర్పాటు చేయకపోతే రూ.5 లక్షల పర్యావరణ అపరాధ రుసుము చెల్లించాలని సూచించింది. 605 ప్రైవేట్ స్కూల్స్ నీటి నిల్వ ప్లాంట్ ఏర్పాటు చేయలేదని గుర్తించినట్లు విద్యాశాఖ కార్యాలయ అధికారులు తెలిపారు.

ఢిల్లీలోని 331 ప్రైవేట్ స్కూల్స్ లో వర్షపు నీటి నిల్వ ప్లాంట్స్ ను ప్రారంభించలేదు. 274 ప్రైవేట్ స్కూల్స్ లో ప్రారంభించారు. ప్లాంట్స్ ఏర్పాటు చేయని స్కూల్స్ రెండు వారాల్లో పర్యావరణ అపరాద రుసుము జమా చేయాలని ఎన్ జీటీ ఈ ఏడాది ఫివ్రబరిలో విద్యాశాఖ కార్యాలయాన్ని ప్రశ్నించింది. చాలా స్కూల్స్ ఎన్ జీటీ ఆదేశాలను పాటించలేదు. మూడు రోజుల్లో పర్యావరణ అపరాద రుసుము చెల్లించాలని ఆ స్కూల్స్ కు తుది నోటీసులు జారీ చేసింది.