24 గంటల్లో 6,088 కరోనా కేసులు, భారత్ లో ఇదే ఫస్ట్ టైమ్

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకి కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. భారత్ లో కరోనా

  • Published By: naveen ,Published On : May 22, 2020 / 04:49 AM IST
24 గంటల్లో 6,088 కరోనా కేసులు, భారత్ లో ఇదే ఫస్ట్ టైమ్

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకి కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. భారత్ లో కరోనా

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకి కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. భారత్ లో కరోనా మరింత తీవ్ర రూపం దాల్చింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 6088 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఒక్క రోజు వ్యవధిలో ఇంత పెద్ద మొత్తంలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. కరోనా వల్ల గురువారం(మే 21,2020) దేశవ్యాప్తంగా 148 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య లక్ష 18వేల 447కి చేరింది. ప్రస్తుతం దేశంలో 66,330 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. చనిపోయిన వారి సంఖ్య 3583కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 48,553 మంది డిశ్చార్జ్ అయ్యారు.

మహారాష్ట్రలోనే అత్యధికం:
దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో మహారాష్ట్రలో అత్యధికంగా నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో గురువారం ఒక్కరోజే 2వేలకు పైగా కేసులు నమోదు కావడం గమనార్హం. గురువారం మహారాష్ట్రలో 2వేల 345 కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఒకే రోజులో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. దాంతో మహారాష్ట్రలో కరోనా బాధితుల సంఖ్య 41వేల 600 దాటింది. అలాగే గురువారం 64 మంది చనిపోవడంతో.. మహారాష్ట్రలో కరోనా మరణాలు 1454 చేరాయి. మహారాష్ట్ర తర్వాత తమిళనాడులో ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయి. తమిళనాడులో గత 24 గంటల వ్యవధిలో… 776 మంది కరోనా బారిన పడటంతో.. మొత్తం బాధితుల సంఖ్య 13,900 దాటింది. గుజరాత్‌లోనూ కరోనా కేసుల సంఖ్య 12,910కి చేరింది. గుజరాత్‌లో నిన్న 24 మంది చనిపోయారు. ఢిల్లీలో 571 కొత్త కేసులు నమోదు కావడంతో .. దేశ రాజధానిలో బాధితుల సంఖ్య 11,600 దాటింది. రాజస్థాన్‌లో 212, మధ్యప్రదేశ్‌లో 246 కొత్త కేసులు నమోదయ్యాయి.

వలస కూలీల రాకతో పెరుగుతున్న కేసులు:
వలస కూలీల రాకతో ఉత్తర్ ప్రదేశ్, బీహార్, ఒడిషా, జార్ఖండ్‌లలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గురువారం ఉత్తరప్రదేశ్‌లో 340 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బీహార్‌లో నిన్న ఒక్కరోజే రికార్డ్ స్థాయిలో 211 మందికి కరోనా సోకింది. ఇందులో ఎక్కువ మంది వలస కూలీలే. ఒడిషాలో గత 24 గంటల్లో 51 మందికి వైరస్ సోకడంతో .. ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1003కి చేరింది. కర్ణాటకలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కర్ణాటకలో 143 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో కర్ణాటకలో మొత్తం కేసుల సంఖ్య 1600 దాటింది.

ప్రపంచవ్యాప్తంగా 50లక్షల 84వేల కరోనా కేసులు:
అటు ప్రపంచవ్యాప్తంగానూ కరోనా వైరస్ విలయతాండం చేస్తోంది. ఈ మహమ్మారి 213 దేశాలకు విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 50లక్షల 84వేల 932కు చేరుకుంది. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 27 లక్షల 33 వేల 400. వ్యాధి నుంచి 20 లక్షల 21 వేల 813 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. కోవిడ్‌-19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 3 లక్షల 29 వేల 719 మంది మృత్యువాతపడ్డారు. కోవిడ్‌-19 వల్ల అమెరికాలో అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో అమెరికాలో 1,561 మంది చనిపోయారు. వ్యాధి కారణంగా అమెరికాలో ఇప్పటివరకు 95వేల మంది మరణించారు. 

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఇప్పటివరకు అత్యధికంగా కరోనా మరణాలు సంభవించిన దేశాల వివరాలు
* అమెరికా-95,087
* యూకే-35,704
* ఇటలీ-32,330
* ఫ్రాన్స్‌-28,132
* స్పెయిన్‌-27,888
* బ్రెజిల్‌-18,894
* బెల్జియం-9,150
* జర్మనీ-8,270
* ఇరాన్‌-7,183
* మెక్సికో-6,090
* కెనడా-6,031
* నెదర్లాండ్స్‌లో-5,748

కరోనా కేసులు, మరణాల్లోనూ అమెరికానే అగ్రరాజ్యం:
చైనాలోని వుహాన్ సిటీలో తొలి క‌రోనా వైర‌స్ కేసును 2019 డిసెంబ‌ర్ చివ‌రిలో గుర్తించిన‌ట్లు ఆ దేశం చెబుతోంది. వైర‌స్ ఒక‌రి నుంచి మ‌రొక‌రికి వేగంగా వ్యాపిస్తుండ‌డంతో ఆ దేశం అప్ర‌మ‌త్త‌మై వుహాన్ న‌గ‌రంలో లాక్ డౌన్ విధించింది. క‌ఠిన ఆంక్ష‌ల అమ‌లుతో దాదాపు నాలుగు నెలల్లో వైర‌స్ వ్యాప్తి పూర్తిగా కంట్రోల్ లోకి తెచ్చింది. అయితే ఇటీవ‌ల మ‌ళ్లీ కొత్త‌గా కేసులు పెరుగుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు ఆ దేశంలో 82వేల 965 క‌రోనా కేసులు న‌మోదు కాగా.. 4వేల 634 మంది మ‌ర‌ణించారు. ఈ మ‌హ‌మ్మారి చైనాలో పుట్టినా అతి తీవ్రంగా ప్ర‌భావితం అయింది మాత్రం అగ్ర‌రాజ్యం అమెరికానే. ఆ దేశంలో ఇప్ప‌టికే 16 ల‌క్ష‌లకు పైగా క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఆ దేశంలో 95 వేల మంది మ‌ర‌ణించ‌గా.. 3 ల‌క్ష‌ల 61 వేల మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం 11 ల‌క్ష‌ల మందికి పైగా చికిత్స పొందుతున్నారు.

Read: భారత్​లో 5 కోట్ల మందికి పైగా ​కరోనా సోకే అవకాశం