భారత్‌లో పడగ విప్పుతున్న కరోనా : 62 పాజిటివ్ కేసులు

భారత్‌లో కరోనా పడగ విప్పుతోంది. రోజురోజుకు విస్తరిస్తూ దేశాన్ని కమ్మేస్తోంది. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 62కి చేరింది.

  • Published By: veegamteam ,Published On : March 11, 2020 / 04:58 AM IST
భారత్‌లో పడగ విప్పుతున్న కరోనా : 62 పాజిటివ్ కేసులు

భారత్‌లో కరోనా పడగ విప్పుతోంది. రోజురోజుకు విస్తరిస్తూ దేశాన్ని కమ్మేస్తోంది. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 62కి చేరింది.

భారత్‌లో కరోనా పడగ విప్పుతోంది. రోజురోజుకు విస్తరిస్తూ దేశాన్ని కమ్మేస్తోంది. కేరళ, కర్ణాటక, పూణెలో కొత్త కేసులతో హడలెత్తిస్తోంది. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 62కి చేరింది. దీంతో అప్రమత్తమైన కేంద్రం…రాష్ట్రాలకు సూచనలు జారీ చేయడంతో పాటు హై అలర్ట్ ప్రకటించింది. ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ తదితర దేశ పౌరులకు వీసాల అనుమతిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

భారత్‌లో కరోనా విస్తరిస్తుండటంతో తీవ్రమైన ఆందోళన నెలకొంది. కేరళలోని ఆరుగురికి కరోనా సోకినట్లుగా ప్రభుత్వం నిర్ధారించడంతో ఈ ఒక్క రాష్ట్రంలోనే 12 కేసులు నమోదైనట్లైంది.. మహమ్మారి మరింత విస్తరించకుండా ఉండేందుకు ఏడో తరగతి పరీక్షలను వాయిదా వేయడంతో పాటు అన్ని రకాల స్కూళ్లు, సినిమా హాళ్లను  నెలాఖరువరకూ మూసేయాలని ప్రభుత్వం ఆదేశించింది.  కరోనా వైరస్ భయం వెంటాడుతున్న నేపథ్యంలో శబరిమల దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరు వరకు ఆలయానికి రావద్దని భక్తులకు విజ్ఞప్తి చేసింది. 

కేరళ పొరుగు రాష్ట్రం కర్నాటకలోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది.. అమెరికా వెళ్లొచ్చిన ఓ వ్యక్తికి కోవిడ్ 19 వైరస్ సోకగా..అతని నుంచి అతని భార్య, కుమార్తెతో పాటు ఓ స్నేహితుడికి కూడా సోకింది. దీంతో పాటే మరో 2500మందిని స్క్రీనింగ్ చేసేందుకు కర్నాటక ప్రభుత్వం సిద్ధమైంది.

మహారాష్ట్రలోను నిన్న మూడు కొత్త కేసులు నమోదయ్యాయి. పుణేకు చెందిన ముగ్గురు వ్యక్తులకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ ముగ్గురితో కలిపి మహారాష్ట్రలో కరోనా సోకిన వారి సంఖ్య 5కు చేరింది. ఇటీవల దుబాయ్ నుంచి మహారాష్ట్ర వచ్చిన ఇద్దరు వ్యక్తులకు కరోనా సోకినట్లు గుర్తించారు. తాజాగా కరోనా సోకిన ముగ్గురు వ్యక్తులు ఆ దుబాయ్‌ నుంచి వచ్చిన వారితో సన్నిహితంగా ఉన్నవారేనని తెలుస్తోంది. వీరిని స్థానికంగా ఓ ఆస్పత్రిలో ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

మరోవైపు కరోనా ఎఫెక్ట్ ఐపీఎల్‌పైనా పడే సూచనలు కన్పిస్తున్నాయ్. మెగా ఈవెంట్‌ను వాయిదా వేయమని కేంద్రానికి లేఖ రాసింది కర్నాటక ప్రభుత్వం. బెంగళూరులో మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీంతో బెంగళూరులో మ్యాచులు నిర్వహించే అవకాశాలు లేవని భావిస్తున్నారు. మరోవైపు బిసిసిఐ అధ్యక్షుడు గంగూలీ మాత్రం ఐపిఎల్ ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేసేది లేదని ప్రకటించారు. అయితే… కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో..ఐపిఎల్ నిర్వహణపై  కొన్నిరోజుల్లో స్పష్టత రానుంది. 

See Also | డిగ్గీరాజా సైటైర్లు : సింధియాకు స్వైన్ ఫ్లూ వచ్చినట్లుంది..మోడీ దగ్గరైనా చల్లగా ఉండు