Corona cases: దేశంలో కొత్తగా 6,298 కరోనా కేసులు నమోదు.. నిన్న కోలుకున్న 5,916 మంది

దేశంలో కొత్తగా 6,298 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కరోనా నుంచి 5,916 మంది కోలుకున్నారని వివరించింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 4,39,47,756కు చేరిందని చెప్పింది. దేశంలో ప్రస్తుతం 46,748 మందికి కరోనాకు చికిత్స అందుతోందని తెలిపింది. ప్రస్తుతం రికవరీ రేటు 98.71 శాతంగా ఉన్నట్లు పేర్కొంది.

Corona cases: దేశంలో కొత్తగా 6,298 కరోనా కేసులు నమోదు.. నిన్న కోలుకున్న 5,916 మంది

Corona cases

Corona cases: దేశంలో కొత్తగా 6,298 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కరోనా నుంచి 5,916 మంది కోలుకున్నారని వివరించింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 4,39,47,756కు చేరిందని చెప్పింది. దేశంలో ప్రస్తుతం 46,748 మందికి కరోనాకు చికిత్స అందుతోందని తెలిపింది. ప్రస్తుతం రికవరీ రేటు 98.71 శాతంగా ఉన్నట్లు పేర్కొంది.

డైలీ పాజిటివిటీ రేటు 1.89 శాతంగా ఉన్నట్లు చెప్పింది. వారాంతపు పాజిటివిటీ రేటు 1.70 శాతంగా ఉన్నట్లు తెలిపింది. దేశంలో ఇప్పటివరకు 216.17 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు పేర్కొంది. వాటిలో రెండో డోసులు 94.62 కోట్లు, బూస్టర్ డోసులు 19.14 కోట్లు ఉన్నాయని వివరించింది. నిన్న దేశంలో 19,61,896 డోసుల వ్యాక్సిన్లు వేసినట్లు చెప్పింది. ఇప్పటివరకు దేశంలో 89.09 కోట్ల కరోనా పరీక్షలు చేసినట్లు పేర్కొంది. నిన్న 3,33,964 కరోనా పరీక్షలు చేసినట్లు వివరించింది.

K.T.Rama Rao slams Modi: భారత కరెన్సీపై గాంధీజీకి బదులు మోదీజీ చిత్రాన్ని ముద్రిస్తారా?: కేటీఆర్