భారత్ లో ఒక్క రోజే 6,654కరోనా కేసులు…చైనాలో ఒక్క కేసు కూడా లేదంట

  • Published By: venkaiahnaidu ,Published On : May 23, 2020 / 05:35 AM IST
భారత్ లో ఒక్క రోజే 6,654కరోనా కేసులు…చైనాలో ఒక్క కేసు కూడా లేదంట

భారత్ లో రోజురోజుకి రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 6,654కొత్త కేసులు నమోదయ్యాయని ఇవాళ(మే-23,2020) కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ప్రకటించింది. ఒక్క రోజులో దేశంలో నమోదైన అత్యధిక కేసులు ఇవేనని తెలిపింది. గడిచిన నాలుగు రోజుల్లోనే దాదాపు 25వేల కేసులు నమోదైనట్లు తెలిపింది.

దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,25,101కి చేరింది. గడిచిన నాలుగు రోజుల్లోనే దాదాపు 25వేల కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 137 మంది మరణించడంతో దేశంలో మొత్తం మృతుల సంఖ్య 3,720కి చేరింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 51,783 మంది హాస్పిటల్స్ నుంచి డిశ్చార్జి అయ్యారు.  ప్రస్తుతం దేశంలో 69,597 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

దేశంలో మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు రాష్ట్రాల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 53లక్షలు దాటింది. దాదాపు 3లక్షల 40వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక బ్రెజిల్ లో కరోనా కేసులు గణనీయంగా పెరిగాయి. యూఎస్ తర్వాత ప్రపంచంలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి.

ఇక వైరస్ మొదట వెలుగులోకి వచ్చిన చైనాలో శుక్రవారం ఒక్క కేసు కూడా నమోదుకాలేదని ఆ దేశం శనివారం ప్రకటించింది. చైనాలోని వూహాన్ సిటీలో గతేడాది డిసెంబర్ లో తొలిసారిగా కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. వైరస్ ఫైట్ లో పెద్ద విజయాలు సాధించినట్లు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు సంబరాలు జరిపిన మరుసటి రోజే చైనాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాలేదని ఆ దేశం ప్రకటించింది.

Read:భారత్ లో ఒక్క రోజే 6వేలకు పైగా కరోనా కేసులు…తగ్గిన మరణాల రేటు