Punjab ‘Tree Man’: 10 వేల మొక్కలు నాటిన హరిత ప్రేమికుడు..ప్రాణావాయువు అందక మృతి!

ప్రజలకు స్వచ్ఛమైన ప్రాణవాయువు అందాలని తపన పడి..12 ఏళ్లుగా 10 వేలకు పైగా మొక్కలు నాటిన హరిత ప్రేమికుడు హరదయాళ్ సింగ్ ప్రాణవాయువు అందక మృతి చెందారు. పంజాబ్ కు చెందిన 67 ఏళ్ల హరదయాళ్ సింగ్ కరోనాతో ఊపిరి అందక ప్రాణాలు కోల్పోయారు.

Punjab ‘Tree Man’: 10 వేల మొక్కలు నాటిన హరిత ప్రేమికుడు..ప్రాణావాయువు అందక మృతి!

Punjab Tree Man Corona Effected (1)

Punjab ‘Tree Man’Hardayal Singh : పచ్చదనం ఉంటేనే ప్రాణవాయువు అందుతుంది. లోకమంతా పచ్చగా కళకళలాడాలి. ఎక్కడ చూసిన పచ్చదనే కనిపించాలనే తపన 67 ఏళ్ల హరదయాళ్ సింగ్ ది. అందుకోసం వృద్ధాప్యాన్ని కూడా లెక్క చేయకుండా మొక్కలు నాటుతుంటాడు. ఉదయం లేచింది మొదలు మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుడతాడు. ఒకరోజు రెండు రోజులు కాదు ప్రతీరోజు హరదయాళ్ సింగ్ దినచర్యలో భాగం మొక్కలు నాటటం. అలా ఇప్పటి వరకూ 10వేలకు పైగా మొక్కలు నాటారు.ఉదయ్యానే లేవడం..సైకిల్‌కు తగిలించిన బుట్ట నిండా మొక్కలు, మట్టి నిపుకోవడం. ఖాళీ స్థలం ఎక్కడ ఉందాని వెతకటం అక్కడ మొక్కలు నాటటం ఆయనకు అలవాటు. ఖాళీగా స్థలం కనిపిస్తే చాలు అక్కడ మొక్కలు నాటేయాల్సిందే. 12గా అదే అతని పని. మొక్కలు నాటటాన్ని ఏదో పనిగా కాకుండా తపస్సుగా చేస్తుంటారయన. ఆయన లక్ష్యం ఒకటే..పరిసరాలన్ని పచ్చదనంతో నిండిపోవాలి.

ప్రజలకు స్వచ్ఛమైన ప్రాణవాయువు అందాలి. అందుకే అందరూ ఆయన్ని ఆప్యాయంగా ‘ట్రీ మ్యాన్’ అని పిలుస్తుంటారు. అలా ప్రజలకు స్వచ్ఛమైన ప్రాణవాయువు అందాలని మొక్కలు నాటే ఆయనే ప్రాణవాయువు అందక మరణించారు. ఇది చాలా చాలా దురదృష్టకరమని చెప్పితీరాలు. కరోనా వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు దేశ వ్యాప్తంగా. కానీ ప్రాణవాయువు కోసం మొక్కలు నాటే కార్యక్రమాన్ని తపస్సులా భావించిన హరదయాళ్ సింగ్ మరణం తీరని లోటని చెప్పక తప్పదు.పంజాబ్‌లోని పాటియాలా జిల్లాలో గల ధబ్లాన్ గ్రామంలో నివసించేవారు హరదయాళ్ సింగ్. గ్రామస్థులందరికీ స్వఛ్చమైన ప్రాణవాయువు అందాలని పరితపించిపోయేవారు. కానీ ఆయన చివరి రోజుల్లో అదే ప్రాణావాయువు కోసం అలమటిస్తూ మృతి చెందారు హరదయాళ్ సింగ్. ప్రాణవాయువు కోసం తపించిపోయిన ఆయనను కరోనా మహమ్మారి పొట్టన పెట్టుకుంది.

హరదాయళ్ సింగ్‌ మే 17న కరోనా సోకినట్లుగా తెలిసింది. అప్పటికే ఆయన ఊపిరి తీసుకోవటానికి ఇబ్బందిపడేవారు. కరోనా లక్షణాలు కనిపిస్తేనే సొంత బంధువులే ఆమడదూరం పారిపోతున్న క్రమంలో ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్లటంలో గ్రామస్థులు హరదయాళ్ కుటుంబ సభ్యులకు సహాకారం అందించటానికి ఏమాత్రం వెనుకాడలేదు. ఆక్సిజన్ బెడ్ల కొరత కొనసాగుతున్న సమయంలో కూడా గ్రామస్తులు ఓ రోజంతా బెడ్ కోసం ప్రయత్నించి ఎట్టకేలకు ఆయన్ని చండీగఢ్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చించగలిగారు. కానీ.. బెడ్ దొరికిందన్న ఆనందం హరదయాళ్ కుటుంబసభ్యులకు ఎక్కువ సేపు మిగల్లేదు. మా దగ్గర వెంటిలేటర్ లేదని ఆస్పత్రి చెప్పటంతో సాధారణ సిలిండర్లతోనే ఆయనకు ఆక్సిజన్ అందించారు.

కానీ..హరదయాళ్ కు రాను రాను ఆక్సిజన్ లెవెల్స్ తగ్గటం..పెరగటం ఇలా ఊపిరి తీసుకోవటానికి నానా అవస్తలు పడిపోయేవారు. అది చూసిన కుటుంబ సభ్యులు ఆందోళన పడిపోయేవారు. ఓ పక్క ఆయన్ని చూసుకుంటునూ మరోపక్క వెంటిలేటర్ కోసం యత్నించారు.అలా ఎట్టకేలకు మే 23న ఆయనకు వెంటిలేటర్ లభించింది.

కానీ ఫలితం దక్కలేదు. చివరి ఘడియల్లో కూడా పాపం ఆయన ఊపిరి తీసుకోవటానికి చాలా కష్డపడ్డారు. అలా అవస్థ పడుతూ మే 25న హరదయాళ్ ప్రాణాలు కోల్పోయారు. ప్రాణవాయువు కోసం మొక్కలు నాటే కార్యక్రమాన్ని అంకిత భావంతో..తపస్సులా చేసిన ఆయనకే ప్రాణవాయువు అందక మరణించారు. ఊపిరి అందక అవస్థపడుతూ ఆయన తుదిశ్వాస విడిచిన దయనీయ స్థతికి కుటుంబ సభ్యులే కాదు గ్రామస్తులు..ఆయన గురించి తెలిసినవారంతా కన్నీరు పెట్టుకున్నారు. భర్త మరణంతో అల్లాడిపోయిన ఆయన భార్య కుల్విందర్ కౌర్ భర్త మృతదేహాన్ని ఆవేదనగా..ఆర్థ్రరంగా..చూస్తూ..‘‘జీవితం అంటే ఇదేనేమో’’ అంటుంటే గ్రామస్తులంతా కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆయన కుటుంబ సభ్యుల్ని ఓదార్చటం ఎవ్వరి వల్లా కాలేదు.