CBI Staff : 68 మంది సీబీఐ సిబ్బందికి కరోనా

ముంబైలోని బాంద్రా - కుర్లా కాంప్లెక్స్ కార్యాలయంలో పనిచేస్తున్న 68 మంది సీబీఐ ఉద్యోగులకు కరోనా వైరస్ సోకినట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారి ఒకరు శనివారం తెలిపారు.

CBI Staff : 68 మంది సీబీఐ సిబ్బందికి కరోనా

Cbi Raids

CBI Staff : ముంబైలోని బాంద్రా – కుర్లా కాంప్లెక్స్ కార్యాలయంలో పనిచేస్తున్న 68 మంది సీబీఐ ఉద్యోగులకు కరోనా వైరస్ సోకినట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారి ఒకరు శనివారం తెలిపారు. బీకేసీ కార్యాలయంలో పనిచేస్తున్న 235 మంది సిబ్బందికి పరీక్షలు నిర్వహించాలసిందిగా.. సీబీఐ బృహన్‌ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌ను కోరగా.. వారు పరీక్షలు నిర్వహించినట్లు సదరు అధికారి తెలిపారు. “ఈ 235 మంది సిబ్బందిలో అధికారులతో సహా, 68 మందికి పాజిటివ్ నిర్దారణ అయినట్లు ఆయన వివరించారు. కరోనా సోకిన వారిని హోమ్ క్వారంటైన్‌కు పంపినట్లు వివరించారు.

Also Read : Corona Symptoms : జ్వరం వస్తే కరోనా కాదు.. అసలు లక్షణాలు ఏంటి? వైద్యనిపుణులు ఏమంటున్నారు?

ఇక మహారాష్ట్రలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. శుక్రవారం 20, 971 కరోనా కేసులు నమోదయ్యాయి. శనివారం ఈ సంఖ్య క్రాస్ అవుతుందని అధికారులు చెబుతున్నారు. దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 20 శాతానికిపైగా కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. కేసుల తీవ్రత అధికంగా ఉండటంతో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే మహారాష్ట్రలో కర్ఫ్యూ నడుస్తోంది. రాష్ట్రప్రభుత్వం వారం క్రితమే నైట్ కర్ఫ్యూ అమలు చేస్తోంది.

Also Read : Corona : తెలంగాణ సచివాలయంలో ఐదుగురికి కరోనా పాజిటివ్