PM Modi: గ్రామాల్లోని ఏడు కోట్ల ఇండ్లకు నల్లా నీళ్లు ఇచ్చాం: ప్రధాని మోదీ

తమ ప్రభుత్వం చేపట్టిన ‘జల్ జీవన్ మిషన్’ కింద గ్రామీణ ప్రాంతాల్లోని ఏడు కోట్ల ఇండ్లకు నల్లాల ద్వారా మంచి నీళ్లు అందిస్తున్నామని ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. లక్ష గ్రామాల్లో బహిరంగ మల విసర్జన పూర్తిగా అంతమైందన్నారు.

PM Modi: గ్రామాల్లోని ఏడు కోట్ల ఇండ్లకు నల్లా నీళ్లు ఇచ్చాం: ప్రధాని మోదీ

PM Modi: ‘జల్ జీవన్ మిషన్’ కింద దేశంలోని గ్రామాల్లో ఉన్న ఏడు కోట్ల ఇండ్లకు నల్లాల ద్వారా మంచి నీళ్లు అందిస్తున్నామని ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. గోవాలో శుక్రవారం జరిగిన ‘హర్ ఘర్ జల్ ఉత్సవ్’ కార్యక్రమంలో ప్రధాని మోదీ వర్చువల్‌గా పాల్గొన్నారు.

Hyderabad: ఒంటికి నిప్పంటించుకుని ప్రిన్సిపాల్‪‌ను పట్టుకున్న విద్యార్థి.. ఇద్దరికీ గాయాలు

ఈ సందర్భంగా దేశంలో నీటి సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. ‘‘దేశంలోని పది కోట్ల ఇండ్లకు నల్లాల ద్వారా స్వచ్ఛమైన నీళ్లు అందిస్తున్నాం. ప్రతి ఇంటికి నీళ్లు అందించడం మా ప్రభుత్వం సాధించిన ఘనత. ఇది అందరి సహకారం వల్లే సాధ్యమైంది. దేశంలో బహిరంగ మల విసర్జన లేకుండా చేశాం. దాదాపు లక్షకుపైగా గ్రామాల్లో బహిరంగ మల విసర్జన జరగడం లేదు. మూడేళ్లలోనే ‘జల్ జీవన్ మిషన్’ కింద ఏడు కోట్ల ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చి, మంచి నీళ్లు అందిస్తున్నాం. ఇది సాధారణ విషయం కాదు. ఏడు దశాబ్దాలుగా మూడు కోట్ల ఇండ్లకు మాత్రమే నల్లా నీళ్లు అందేవి. ఇప్పుడు పది కోట్ల ఇండ్లకు నల్లా నీళ్లు అందుతున్నాయి.

Munawar Faruqui: మునావర్ షోకు అనుమతి నిరాకరణ.. ఎమ్మెల్యే రాజాసింగ్ హౌజ్ అరెస్ట్

దేశంలో నీటి కొరత అభివృద్ధికి ఆటంకంగా మారింది. ఈ సమస్యను అధిగమించాలనుకుంటే 24 గంటలూ శ్రమించాలి. నీటి భద్రత కోసం మా పార్టీ ఎనిమిదేళ్లుగా ప్రయత్నిస్తోంది’’ అని మోదీ అన్నారు. గోవాతోపాటు, దాద్రా అండ్ నగర్ హవేలి, దామన్ అండ్ దియూ.. దేశంలోనే పూర్తి మంచి నీటి వసతి కలిగిన రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతాలుగా నిలిచాయి. ఈ సందర్భంగా ప్రధాని అభినందనలు తెలిపారు.