కర్ణాటక కీలక నిర్ణయం…7రోజులు క్వారంటైన్ లో ఉండాల్సిందే

  • Published By: venkaiahnaidu ,Published On : May 23, 2020 / 09:01 AM IST
కర్ణాటక కీలక నిర్ణయం…7రోజులు క్వారంటైన్ లో ఉండాల్సిందే

దశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన నాలుగు రోజుల్లోనే 25వేల కొత్త కేసులు నమోదయ్యాయి. ఇటువంటి పరిస్థితుల నడుమ సోమవారం(మే-25,2020)నుంచి దేశీయ విమానసర్వీసులు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ సమయంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న ఆరు రాష్ర్టాల నుంచి కర్ణాటకకు వచ్చినవారిని క్వారంటైన్‌ కు పంపిస్తామని యడియూరప్ప ప్రభుత్వం తెలిపింది. 

కోవిడ్-19 కేసులు ఎక్కువగా నమోదవుతున్న మహారాష్ట్ర, రాజస్థాన్‌, ఢిల్లీ, గుజరాత్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌ నుంచి కర్ణాటకకు వచ్చినవారు తప్పనిసరిగా 7 రోజులపాటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉండాల్సిందేనని కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. కరోనా పరీక్షల్లో పాజిటివ్‌ అని తేలితే వారిని మరో ఏడు రోజులపాటు గృహనిర్బంధంలో ఉంచుతామని తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ఆరోగ్య శాఖ పలు మార్గదర్శకాలను విడుదల చేసింది.

వైరస్‌ నెగటివ్‌ వచ్చిన వారికి కూడా హోం క్వారంటైన్‌ విధించనున్నుట్లు తెలిపింది. ఇక తక్కువ వైరస్‌ వ్యాప్తి ఉన్న రాష్ట్రాల నుంచి కర్ణాటకకు వచ్చిన వారు విధిగా 14 రోజుల పాటు హోం కార్వంటైన్‌ను పాటించాలని యడియూరప్ప సర్కార్ కోరింది. ఇక బిజినెస్‌ కార్యకలాపాల కోసం తమ రాష్ట్రానికి వచ్చే వారు ఐసీఎంఆర్‌ గుర్తించిన కరోనా ల్యాబ్‌ నుంచి కోవిడ్‌ నిర్ధారణ పరీక్ష చేసుకొని నెగటివ్‌ అని తెలిన తర్వతే రావాలని పేర్కొంది.

రాష్ట్రానికి రావడనికి తీసుకున్న రిపోర్టు రెండు రోజలు మాత్రమే పనిచేస్తుందని అంతలోపే కర్టాటకకు రావాలని చెప్పింది. గర్భిణిలు,10ఏళ్ల లోపు చిన్నారులు, 80 ఏళ్ల పైబడిన వృద్ధులు హోం క్వారంటైన్‌కు‌ పరిమితం కావాలని ఆరోగ్యశాఖ విజ్ఞప్తి చేసింది. గతంలో మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌, కేరళ ప్రజలు ఈ నెలాఖరు వరకు కర్ణాటకలోకి రాకుండా ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే.

Read: మళ్లీ స్ట్రిక్ట్ రూల్స్ : కరోనా విజృంభణతో ఆరెంజ్ సిటీలో ఆంక్షల సడలింపు ఉపసంహరణ