కరోనా వ్యాక్సిన్..రేసులో 7 భారతీయ సంస్థలు..ఎమి చేస్తున్నాయి

  • Published By: madhu ,Published On : July 21, 2020 / 07:43 AM IST
కరోనా వ్యాక్సిన్..రేసులో 7 భారతీయ సంస్థలు..ఎమి చేస్తున్నాయి

ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న కరోనా వైరస్ కు చెక్ పెట్టెందుకు ఎన్నో సంస్థలు అహర్నిశలు శ్రమిస్తున్నాయి. శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో పరీక్షలు జరుపుతూ బిజీ బిజీగా ఉన్నారు. కొన్ని సంస్థలు ఇప్పటికే ట్రియల్స్ కూడా ప్రారంభించాయి.

ఆగస్టులో వ్యాక్సిన్ తీసుకొస్తామని రష్యా ప్రకటించిన సంగతి తెలిసిందే. భారతదేశానికి చెందిన కొన్ని సంస్థలు వ్యాక్సిన్ తయారీ చేసే పనిలో పడ్డాయి. వివిధ దేశాల్లో వ్యాక్సిన్ పై ప్రయోగాలు వేగంగా కొనసాగుతున్నాయి. భారత్ నుంచి దాదాపు 7 సంస్థలు టీకాను తీసుకరావడంలో నిమగ్నమయ్యాయి.

దేశీయ ఫార్మా సంస్థలైన భారత్ బయోటిక్, సీరమ్ ఇనిస్టిట్యూట్, జైడస్ కాడిలా, పనాసియా బయోటిక్, ఇండియన్ ఇమ్యునోలాజికల్స్, బయోలాజికల్ ఈ, మైన్వాక్స్ లాంటి సంస్థలు వ్యాక్సిన్ రూపొందించే పనిలో పడ్డాయి.

ప్రస్తుతం ఇవి ఏ స్థాయిలో పనిచేస్తున్నాయంటే : – 

1. Covaxin, Bharat Biotech : కొవాక్జిన్ టీకా.. ఇటీవలే ఫేజ్ 1, ఫేజ్ 2 క్లినికల్ ట్రయిల్స్‌కు అనుమతి పొందింది. హైదరాబాద్ లో ఉన్న కంపెనీ సహకారంతో తయారు చేశారు. గత వారమే Rohtak’s Post-Graduate Institute of Medical Sciences లో మనుషులపై ప్రయోగాలు ప్రారంభించింది.
2. AstraZeneca, Serum Institute of India : 2020 డిసెంబ‌ర్ వ‌ర‌కు క‌రోనా వ్యాక్సిన్‌ను మార్కెట్‌లోకి తెస్తామ‌ని చెబుతోంది. మూడో శ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్న అస్ట్రాజెనికా ఆక్స్ ఫర్డ్ టీకాపై పనిచేస్తున్నారు. ఆగస్టులో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించనుంది.
3. ZyCoV-D, Zydus Cadila : క్లినికల్ ట్రయల్స్ ఏడు నెలల్లో పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సంస్థ తెలిపింది. గత వారం మొదటి వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ మనుషులపై ప్రయోగించింది. ట్రయల్స్ పూర్తి కావడానికి…వ్యాక్సిన్ ప్రారంభించడానికి మొత్తం 7 నెలలు పట్టవచ్చని Zydus Cadila ఛైర్మన్ పంకజ్ ఆర్ పటేల్ ఒక ప్రకటనలో తెలిపారు.

4. Panacea Biotec : వ్యాక్సిన్ ను రూపొందించేందుకు అమెరికాకు చెందిన రెఫానా ఇంక్ తో కలిసి ఐర్లాండ్ లో జాయింట్ వెంచర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు జూన్ లో ప్రకటించింది. 500 మిలియన్ మోతాదులో Covid -19 వ్యాక్సిన్ తీసుకరావాలని భావిస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో 40 మిలియన్ మోతాదులకు పైగా డెలివరీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కంపెనీ వెల్లడించింది.
5. Indian Immunologicals : నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్ బోర్డు (Indian Immunologicals)
అనుబంధ సంస్థ అయిన ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్ సంస్థ National Dairy Development Board (NDDB) కోవిడ్ వ్యాక్సిన్ రూపొందించడానికి ఆస్ట్రేలియాకు చెందిన Griffith University తో ఒప్పందం కుదుర్చుకుంది.
6. Mynvax : ఈ కంపెనీ కూడా టీకాను రూపొందించే పనిలో పడింది. 18 నెలలో వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తామని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం ప్రీ – క్లినికల్ ట్రయల్స్ స్థాయిలో ఉందని తెలిపింది.
7. Biological E : Biological E చే చేస్తున్న టీకా..ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ స్థాయిలో ఉంది.

వ్యాక్సిన్ అనేది నాలుగు దశల్లో ఉంటుంది. జంతువులపై ప్రీ క్లినికల్ టెస్టింగ్ లు నిర్వహిస్తారు. ఫేజ్ 1లో కొద్దిమందిపై పరీక్షిస్తారు. వీరి ఆరోగ్యం, వైరస్ ను ఎదుర్కొనడానికి టీకా ఎలా పని చేస్తుందో అధ్యయనం చేస్తారు. ఫేజ్ 2లో పరీక్షలను మరింత విస్తరిస్తారు. ఫేజ్ 3లో వేలాది మందిపై టీకాలను ప్రయోగిస్తారు.