విశ్వంలో అద్భుతం.. ఏడు గ్రహాలు ఒకే రాత్రి చూడొచ్చు

విశ్వంలో అద్భుతం.. ఏడు గ్రహాలు ఒకే రాత్రి చూడొచ్చు

Solar System: ఈ వారం ఆకాశంలో మరో అద్భుతం జరగనుంది. సోలార్ సిస్టమ్‌లోని ఏడు గ్రహాలు ఒక చోటకు చేరనున్నాయి. నవంబరు మొదటి వారం రాత్రి మొత్తం ప్రతీ గ్రహాన్ని విశ్వంలో స్పష్టంగా చూడొచ్చు. సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకూ ఈ అద్భుతాన్ని వీక్షించగలం.

నవంబరు నెలలో గురు, శని గ్రహాలు చాలా సమీపంగా రానున్నాయి. 20ఏళ్ల తర్వాత కలుస్తుండటాన్ని గొప్ప సముదాయంగా భావిస్తున్నారు. వచ్చే నెల మరింత ప్రత్యేకం. 1623వ సంవత్సరం తర్వాత 2020లో మరింత దగ్గరకు చేరనుండటం ఇదే మొదటిసారి.



సూర్యునికి మరింత స్ట్రైట్ గా ఉండడంతో అంగారక గ్రహం మామూలు దాని కంటే ఇంకాస్త ఎక్కువ వేడితో రగిలిపోనుంది. అక్టోబర్ 13నుంచి కాస్త అస్పష్టంగానే కనిపిస్తుంది. అంగారకుడ్ని చూడటానికి ఇంకా సమయం పడుతుందన్నమాట. కాంతి నేరుగా పడుతుండటంతో మరింత ప్రకాశవంతంగా కనిపించనున్నాడు.

సూర్యుడికి చంద్రుడికి వెనుక వైపుకు చేరనున్నాడు ఖగోళ వస్తువు శుక్రుడు. నక్షత్ర వీక్షకులు గెలాక్టిక్ అద్భుతాన్ని చూసేందుకు కొన్ని గంటల సమయం వరకూ వెయిట్ చేయకతప్పదు. దక్షిణార్ధగోళానికి వచ్చేసరికి సూర్యోదయానికి 90నిమిషాల ముందు మాత్రమే ఇలా జరుగుతుంది.

ఈ ప్రక్రియ మొత్తం 3గంటల కంటే ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. అయితే శుక్రుడికి బుధుడు సమాంతరంగా రావడం తెల్లవారు జాము కంటే ముందు సమయంలో జరుగుతుంది.

యురేనస్, నెప్ట్యూన్ కూడా కనిపించే రేంజ్ లో ఉన్నా మానవ కంటికి మాత్రం కనిపించదు. బైనాక్యులర్ లో లేదా టెలిస్కోప్ లో అది వీక్షించగలం. శని గ్రహాన్ని మాత్రం అర్ధరాత్రి తర్వాత కొద్ది గంటలకే కనిపిస్తుంది. 1.7బిలియన్ మైల్స్ దూరంలో యురేనస్ కంటికి కనిపించేంత కాకపోయినా పాక్షికంగా కనిపించే అవకాశాలు ఉన్నాయి.