Boy Spoof Video : 7 ఏళ్ల బుడతడు..న్యూస్ రిపోర్టర్ గా సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నాడు

7 ఏళ్ల పిల్లాడు న్యూస్ రిపోర్టర్ గా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. ఏడేళ్ళ వయసులోనే న్యూస్ రిపోర్టర్ గా అచ్చుగుద్దినట్లుగా యాక్ట్ చేస్తూ రిపోర్ట్ లా బిల్డప్ ఇస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. ఈ బుడ్డోడి వీడియోకు వ్యూసే వ్యూస్ వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో రితూ పేరు రీసౌండ్ గా మారు మ్రగిపోతోంది.

Boy Spoof Video : 7 ఏళ్ల బుడతడు..న్యూస్ రిపోర్టర్ గా సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నాడు

Boy New Reporter

Boy Spoof Video చిన్న పిల్లలు తమ వయస్సుకు మించిన పనులు చేస్తుంటే చిచ్చరపిడుగులు అంటుంటాం. కొంతమంది చిన్న పిల్లలు కూడా పెద్ద వాళ్ళు కూడా చేయలేని పనులు చేస్తూ శభాష్ అనిపించుకోవడమే కాదు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటారు. పేద్ద ఆరిందాలాగా చేస్తూ మీరు పిల్లలు కాదురా పిడుగులు అనిపించుకుంటారు. అలా ఓ ఏడేళ్ల పిల్లాడు న్యూస్ రిపోర్లు ఎలా చేస్తారో..అచ్చంగా అలా చేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. కోయంబత్తూరుకు చెందిన ఈ పిల్లాడి పేరు రితూ.. వయసు 7 ఏళ్లు. జ్యోతి రాజ్, ఆశా దంపతులకు ముద్దుల కొడుకు. ఏడేళ్ళ వయసులోనే న్యూస్ రిపోర్టర్ గా అచ్చుగుద్దినట్లుగా యాక్ట్ చేస్తూ రిపోర్ట్ లా బిల్డప్ ఇస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. ఈ బుడ్డోడి వీడియోకు వ్యూసే వ్యూస్ వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో రితూ పేరు మారుమ్రోగిపోతోంది.

రితూ ఒక్కసారి ఏదన్నా చూశాడంటే చాలు ఇట్టే పట్టేస్తాడు. అచ్చు గుద్దినట్లుగా అనుకరించేయటం రీతూ స్పెషాలిటీ. ఈ విషయాన్ని గ్రహించిన తన తండ్రి, రితూకి లాక్డౌన్ సమయంలో న్యూస్ ఛానల్ ని చూపించడం మొదలు పెట్టాడు. అలా రితూ న్యూస్ ఛానల్ లో న్యూస్ రిపోర్టర్ చెప్పే మాటలను కంఠస్థం చేసేసి రిపోర్టర్లు రిపోర్టింగ్ చేసేటప్పుడు ఉండే బాడీ లాంగ్వేజ్ తో అచ్చంగా చేసేస్తూ అద్దరగొట్టేయటం మొదలుపెట్టాడు.రితూ చేస్తున్న అల్లరి వీడియోలను సేవ్ చేసి, యూట్యూబ్లో షేర్ చేయటానికి వాటిని తండ్రి ఒక యూట్యూబ్ పేజ్ ను కూడా ప్రారంభించాడు. కానీ రితూ కి ఏ మాత్రం నచ్చలేదు. రితూ అందుకు ఒప్పుకోకుండా, తనకు షార్ట్ స్కిట్స్ చేయాలని ఉందని తన నాన్నతో చెప్పాడు. దీంతో యూట్యూబ్ పేజీలో వీడియోలు పెట్టడం ఆపేసాడు తండ్రి.

ఇక తండ్రి తన ఆలోచనలకు పదును పెట్టాడు. ఎలాగైనా తన కొడుకు ఆలోచనలకు చేర్చాలనుకున్నాడు. అలా ప్రయోగాత్మకంగా వార్తాపత్రిక పై ఒక చిన్న స్పూఫ్ స్కిట్ చేశారు. ఇందులో రితూ యాంకర్ గా అలాగే రితూ ఫీల్డ్ రిపోర్టర్ గా అలాగే ఒక సామాన్యుడిగా కూడా క్రియేట్ చేశారు. అలా రెండు పాత్రల్లోను ఈ బుడ్డోడు అద్దరగొట్టేశాడు. ఎనిమిది నిమిషాల నిడివి కలిగిన ఒక స్కిట్ ను సిద్ధం చేసి సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ వీడియో రితూలో ఉండే షార్ట్ నెస్ కు అద్దం పడుతోంది. రెండు పాత్రల్ని అలవోకగా చేసేసాడీ బుడ్డోడు.ఏడు సంవత్సరాల వయసులోనే తమిళ పదాలను స్పష్టంగా పలకడంతో పాటు, తమిళ రిపోర్టర్ లను తలపించేలా రితూ న్యూస్ రిపోర్టర్ గా చేసేస్తున్నాడు. అంతేకాదు రితూకు సంబంధించిన వీడియోలను చేయడానికి వారు ఒక యూట్యూబ్ పేజీని కూడా ఓపెన్ చేశారని..తమడా మీడియా తో భాగస్వామ్యం కుదుర్చు కున్నామని తెలిపారు రితూ తండ్రి జ్యోతి రాజ్.