Odisha : మహిళలు,చిన్నారులతో సహా ఐస్‌క్రీం తిన్న 70 మందికి అస్వస్థత ..

ఎండలు మండిపోతున్నాయి. చల్లదనం కోసం ఐస్ క్రీమ్ తినటమే వారు చేసిన తప్పు. ఐస్ క్రీమ్ తిని చిన్నపిల్లలు, మహిళలతో సహా 70మంది ఆస్పత్రిపాలయ్యారు.

Odisha : మహిళలు,చిన్నారులతో సహా ఐస్‌క్రీం తిన్న 70 మందికి అస్వస్థత ..

70 fell ill ..eating ice cream

70 fell ill after eating ice cream : ఒడిశాలో ఐస్ క్రీమ్ తిన్న చిన్నారులు, మహిళలతో సహా 70మంది తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు. అసలే వేసవి కాలం ఎండలు మండిపోతున్నాయి. దీంతో చల్ల చల్లని ఐస్ క్రీమ్ తిన్న 70మంది అస్వస్థకు గురి ఆస్పత్రిపాలైన ఘటన ఒడిశాలోని కోరాపుట్ జిల్లా సిమిలిగూడలో చోటుచేసుకుంది.

 

సిమిలిగుడ సమితి దుదారి పంచాయతీలో శనివారం (జూన్,3) సాయంత్రం ఘాట్‌గుడ, జాతుగూడ, ధుధారి, సొండిపుట్, అల్లిగాం, కమలజ్వాల, నువ్వాపుట్, బడలిగుడ గ్రామాల్లో బండి మీద తిరుగుతు ఓ వ్యక్తి ఐస్ క్రీమ్ విక్రయించాడు. అతని వద్ద ఐస్ క్రీమ్ కొని తిన్నవారంతా తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు. పిల్లలు, పెద్దలు, మహిళలతో సహా 70మంది అస్వస్థతకు గురి అయ్యారు. రాత్రి భోజనాలు చేసి నిద్రపోయే సమయంలో ఐస్‌క్రీం తిన్నవారందరూ కడుపు నొప్పి,వాంతులు, విరేచినాలతో ఇబ్బందిపడ్డారు.

 

దీంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. వెంటనే వారిని దమన్‌జోడి, సునాబెడ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు తరలించారు. వారికి చికిత్స చేసిన డాక్టర్లు పరీక్షలు నిర్వహించగా నిల్వవున్న ఐస్‌క్రీం తినడం వల్ల అది ఫుడ్ పాయిజన్‌గా మారడంతో ఇలా జరిగిందని తెలిపారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న పొట్టంగి ఎమ్మెల్యే ప్రీతమ్ పాడి బాధితులు చికిత్స పొందుతున్న ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి పరామర్శించారు. చికిత్స తరువాత 60 మంది కోలుకోవటంతో ఆదివారం వారిని డిశ్చార్జ్ చేశారు. మిగిలిగన పదిమందికి చికిత్స కొనసాగిస్తున్నారు. ఐస్ క్రీమ్ విక్రయించిన వ్యక్తిని గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు ఎమ్మెల్యే.