Sero Survey : తమిళనాడులో 70 శాతం మందిలో యాంటీబాడీలు

తమిళనాడు రాష్ట్రంలోని 70శాతం మంది జనాభా కోవిడ్-19 యాంటీబాడీలు కలిగి ఉన్నట్లు తాజా సెరో సర్వేలో తేలింది.

Sero Survey : తమిళనాడులో 70 శాతం మందిలో యాంటీబాడీలు

Tn (1)

Sero Survey తమిళనాడు రాష్ట్రంలోని 70శాతం మంది జనాభా కోవిడ్-19 యాంటీబాడీలు కలిగి ఉన్నట్లు తాజా సెరో సర్వేలో తేలింది. గతేడాది కోవిడ్ ప్రారంభమైనప్పటి నుంచి విడుదలైన మూడవ సెరో సర్వే ఇది. ఈ ఏడాది ఏప్రిల్ లో విడుదలైన రెండో సెరో సర్వేలో కేవలం 29శాతం మంది తమళనాడు జనాభాలో మాత్రమే కోవిడ్ యాంటీబాడీలు ఉన్నట్లు తేలిన విషయం తెలిసిందే. అయితే తాజా సెరో సర్వేలో పెద్ద సంఖ్యలో ప్రజలు కోవిడ్ యాంటీబాడీలను కలిగి ఉన్నట్లు తేలింది.

తమిళనాడులో డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ (DPH & PM) ఈ ఏడాది జూలై-ఆగస్టు మధ్య 24,586 శాంపిల్స్ పై మొత్తం ఆరు ల్యాబ్స్ లో చేపట్టిన మూడో సెరో సర్వేలో ఆశక్తికర విషయాలు వెల్లడయ్యాయి. రక్త సీరంలో గణనీయమైన యాంటీబాడీస్ ఉండటం వలన మరియు మెరుగైన వ్యాక్సినేషన్ కారణంగా వ్యాధికి వ్యతిరేకంగా 70 శాతం సెరోపాజిటివిటీ ఉన్నట్లు వెల్లడైంది. సెరోపోసిటివిటీ అనేది… శరీరంలో ఉండే యాంటీబాడీల కొలత, ఇది COVID-19 నుండి రక్షించగలదు.

కోవిడ్ హాట్ స్పాట్ లుగా ఉన్న చెన్నై,కోయంబత్తూరు జిల్లాల్లో సెరోపాజిటివిటీ రేటు 82 శాతం మరియు 71శాతంగా ఉన్నట్లు 3వ సెరో సర్వేలో తేలింది. ఇక,విరుదునగర్ జిల్లాలో అత్యధికంగా 88 శాతం జనాభాలో కోవిడ్ యాంటీబాడీలు ఉన్నట్లు తెలిపింది. ఇక,అత్యల్పంగా కరూర్ జిల్లాలో 51 శాతం సెరోపాజిటివిటీ ఉన్నట్లు తేలింది. నాలుగు జిల్లాలు- కరూర్, నీలగిరి, అరియలూరు మరియు పెరంబలూరు జిల్లాలు 60 శాతం కంటే తక్కువ సెరోపోసిటివిటీ రేటును కలిగి ఉన్నాయి.

మరోవైపు,తమిళనాడులో అర్హులైన జనాభాలో కనీసం 64 శాతం మందికి ఒక డోసు కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వబడింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 5కోట్లకు పైగా కోవిడ్ వ్యాక్సిన్ డోసులను ప్రజలకు సరఫరా చేసినట్లు డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ డాక్టర్ టీఎస్ సెల్వవినయగమ్(మూడవ సెరో సర్వే ఈయన ఆధ్వర్యంలోనే జరిగింది)తెలిపారు.

కాగా, కరోనా వైరస్ ప్రారంభమైన గతేడాది నుంచి ఇప్పటివరకు తమిళనాడులో మొత్తంగా 26.7లక్షల కరోనా కేసులు నమోదవగా,35వేల మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిరోజూ దాదాపుగా 1500 పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి.

ALSO READ ఎయిర్‌టెల్ అదిరే ఆఫర్ .. ఆ స్మార్ట్‌ఫోన్స్ కొంటే రూ.6వేలు క్యాష్‌బ్యాక్