Armed Forces Corona : 70వేల మంది సైనికుల‌కు క‌రోనా.. 190 మంది మృతి

భార‌త దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 70 వేల మంది సైనికుల‌కు క‌రోనా సోకిన‌ట్టు కేంద్ర ర‌క్ష‌ణ శాఖ స‌హాయ‌మంత్రి అజ‌య్ భ‌ట్ తెలిపారు. రాజ్య‌స‌భ‌లో కొవిడ్ కేసుల‌పై అడిగిన ప్ర‌శ్న‌కు అజ‌య్

Armed Forces Corona : 70వేల మంది సైనికుల‌కు క‌రోనా.. 190 మంది మృతి

Armed Forces Corona

Armed Forces Corona : భార‌త దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 70 వేల మంది సైనికుల‌కు క‌రోనా సోకిన‌ట్టు కేంద్ర ర‌క్ష‌ణ శాఖ స‌హాయ‌మంత్రి అజ‌య్ భ‌ట్ తెలిపారు. రాజ్య‌స‌భ‌లో కొవిడ్ కేసుల‌పై అడిగిన ప్ర‌శ్న‌కు అజ‌య్ భ‌ట్ స‌మాధానం ఇచ్చారు. దేశ‌వ్యాప్తంగా మొత్తం 3.40 ల‌క్ష‌ల మంది క‌రోనా బారిన‌ప‌డి కోలుకున్నార‌ని, ఇందులో 70 వేల మంది సాయుధ బ‌ల‌గాలకు చెందిన వారున్నారని ఆయ‌న తెలిపారు. మొత్తం 190 మంది సైనికులు క‌రోనా మ‌హ‌మ్మారికి బ‌లైనట్లు వెల్లడించారు.

Ghee : గుండె ఆరోగ్యానికి, బరువు తగ్గటానికి నెయ్యి వాడకం మంచిది కాదా?

”భారత సైన్యానికి చెందిన 45వేల 576 మంది క‌రోనా బారిన ప‌డ‌గా 137 మంది మృతి చెందారు. ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌లో 14వేల 022 మంది సిబ్బంది క‌రోనా బారిన ప‌డ‌గా 49 మంది మృతి చెందారు. నేవీలో 7వేల 747మంది కొవిడ్ బారిన ప‌డ‌గా న‌లుగురు మృతి చెందారు” అని మంత్రి అజ‌య్ భ‌ట్ రాజ్య‌స‌భ‌లో వివరించారు.

కరోనా మహమ్మారి వెలుగు చూసి.. దాదాపు రెండేళ్లు కావస్తోంది. ఈ రెండేళ్ల కాలంలో అనేక కొత్త వేరియంట్లు ప్రపంచ దేశాలను అతలాకుతలం చేశాయి. నిన్నమొన్నటి దాకా అత్యంత ప్రమాద కారిగా డెల్టా వేరియంట్‌ ప్రజలను వణికించింది. ఇప్పుడు డెల్టా వేరియంట్‌ ను తలదన్నే.. ఒమిక్రాన్‌ అనే మరో కొత్త వేరియంట్‌ సౌతాఫ్రికాలో వెలుగు చూసింది. కరోనా తగ్గుముఖం పట్టి… సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో… ఈ ఒమిక్రాన్‌ అందరినీ భయబ్రాంతులకు గురి చేస్తోంది. వేగంగా వ్యాపిస్తూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.