రికవరీ రేటు ఎక్కువగాఉన్న కేరళలో, మూడో కరోనా మరణం

రికవరీ రేటు ఎక్కువగాఉన్న కేరళలో, మూడో కరోనా మరణం

రికవరీ రేటు ఎక్కువగాఉన్న కేరళలో, మూడో కరోనా మరణం

భారతదేశంలో మొట్టమొదట నమోదైన కరోనా కేసు కేరళలోనే. ఫస్ట్ లాక్‌డౌన్ ప్రకటించింది కేరళలోనే. అటువంటిది కేరళలో వైరస్ వ్యాప్తిని పటిష్ఠంగా కట్టడి చేశారు. ఎలా అంటే ఇన్ని రోజుల్లో ప్రాణాలు కోల్పోయిన మూడో వ్యక్తి కూడా వృద్ధుడే. శనివారం ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్ మెంట్ తీసుకుంటూ ప్రాణాలు కోల్పోయాడు. ముందుగా అతనికి కరోనా అని గుర్తించకపోవడంతో ఆరోగ్యం మరింత క్షీణించిందని పుదుచ్చేరి, కన్నూరు జిల్లా మెడికల్ ఆఫీసర్ డా.కే నారాయణ నాయక్ అంటున్నారు. 

కొద్ది రోజుల ముందే ఆ వ్యక్తి తలస్సరేలోని రెండు ప్రైవేట్ హాస్పిటల్స్ లో జ్వరం వచ్చిందని చికిత్స తీసుకున్నాడు. ఆ తర్వాత పెరియారమ్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు. మృతుడికి కొవిడ్-19 శవాలకు జరిగినట్లే అంత్యక్రియలు నిర్వహిస్తారు. మరణించిన వ్యక్తికి గుండె జబ్బుతో పాటు, హై బీపీ కూడా ఉన్నట్లు డా.ఏకే జయశ్రీ తెలిపారు. 

మార్చి 26న అతణ్ని తలస్సరీలోని ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఆ తర్వాత అతనికి జ్వరం పెరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడం వచ్చేసరికి మరో హాస్పిటల్లో చూపింారు. అతనికి వైరస్ ఎక్కడ అంటుకుంటుందో అనే దానిపై స్పష్టత రాలేదు. ఆ వ్యక్తి చాలా కార్యక్రమాలకు అటెండ్ అవడంతో పాటు పెళ్లిళ్లకు కూడా వెళ్లాడు. మసీదులో ప్రార్థనలకు, పలు వాహనాల్లో ప్రయాణాలుకూడా చేశాడు. 

అతనికి దగ్గరగా ఉన్న 16మంది వ్యక్తులకు కరోనా టెస్టులు నిర్వహించారు. వారికి నెగెటివ్ రాగా, మరో 30-40మందికి టెస్టులు చేయాల్సి ఉంది. (మూడు ముళ్లు.. ఏడు అడుగులు.. ఐదుగురే అతిధులు)

×