Seed Paper : ఈ రిపబ్లిక్ ఇన్విటేషన్ కార్డును నాటితే.. ఉసిరి మొక్క మొలుస్తుంది తెలుసా?

దేశీయ 73వ రిపబ్లిక్ డే సందర్భంగా 2022 ఏడాదిలో రిపబ్లిక్ డే పరేడ్‌లో ఒక స్పెషల్ ఇన్విటేషన్ కార్డు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Seed Paper : ఈ రిపబ్లిక్ ఇన్విటేషన్ కార్డును నాటితే.. ఉసిరి మొక్క మొలుస్తుంది తెలుసా?

73rd Republic Day Invitatio

73rd Republic Day : దేశీయ 73వ రిపబ్లిక్ డే సందర్భంగా 2022 ఏడాదిలో రిపబ్లిక్ డే పరేడ్‌లో ఒక స్పెషల్ ఇన్విటేషన్ కార్డు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మీరు నమ్ముతారో లేదో ఈ ఇన్విటేషన్ కార్డును నాటితే ఉసిరి మొక్క మెలుస్తుంది తెలుసా? అవును.. మీరు చదివింది నిజమే.. ఈ కార్డును నాటితే మొక్క మొలుస్తుంది.. మీరు కానీ.. ఈ కార్డు దిగువ భాగాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే.. అవును కదా అంటారు.. ‘Sow this card to plant an Amla plant’ ( (ఈ కార్డును నాటండి.. ఇదొక ఉసిరి చెట్టు) అని ఇంగ్లీష్‌లో రాసి ఉంది.

ఈ ఇన్విటేషన్ కార్డును సీడ్ (Seed Paper) పేపర్‌తో తయారు చేశారు. పేపర్ తయారీ ప్రక్రియలోనే ఇందులో విత్తన ఎరువును ఉపయోగించి రూపొందించారు. కార్డు ప్రింట్ చేసిన కాగితాన్ని ప్లాంటబుల్ పేపర్ అని కూడా పిలుస్తారు. ఇలాంటి కాగితాన్ని వాడటం పర్యావరణానికి హాని కలిగించదు. వెంటనే మట్టిలో కలిసిపోతుందట..

73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు (73rd Republic Day) దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. త్రివిధ దళాల నుంచి రాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరించారు. వివిధ ప్రభుత్వ శాఖలు ప్రదర్శించిన శకటాలు, సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. రాష్ట్రాల రాజధానుల్లోనూ గవర్నర్లు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

Read Also : Girl Tortured: 14 ఏళ్ల బాలికను నిర్బంధించి మూడు రోజులుగా యువకుడు చిత్రహింసలు