Republic Day : 73వ గణతంత్ర వేడుకలకు భారతావని సిద్ధం
ప్రధాని మోదీ జాతీయ యుద్ధస్మారకం వద్దకు వెళ్లి దేశం తరపున అమర వీరులకు నివాళులు అర్పించిన తర్వాత గణతంత్ర పరేడ్ కార్యక్రమం ప్రారంభమవుతుంది.

Republic Day Celebrations : 73వ గణతంత్ర దినోత్సవానికి భారతావని సిద్ధమైంది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న వేళ ఈ ఏడాది వేడుకలు ప్రత్యేకంగా నిలవనున్నాయి. ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో మరికొద్దిగంటల్లో జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌తో గణతంత్ర వేడుకలు ప్రారంభంకానున్నాయి. గణతంత్ర పరేడ్ ఎప్పటిలా ఉదయం 10 గంటలకు కాకుండా ఈసారి అరగంట ఆలస్యంగా పదిన్నర గంటలకు ప్రారంభించనున్నారు.
ప్రధాని మోదీ జాతీయ యుద్ధస్మారకం వద్దకు వెళ్లి దేశం తరపున అమర వీరులకు నివాళులు అర్పించిన తర్వాత గణతంత్ర పరేడ్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అనంతరం పరేడ్‌ను వీక్షించేందుకు ప్రధాని, ఇతర ప్రముఖులు రాజ్పథ్చేరుకుంటారు. సంప్రదాయం ప్రకారం… రాజ్‌పథ్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం… 21 గన్ సెల్యూట్‌తో జాతీయ గీతం ఆలపిస్తారు.
AP PRC : తగ్గేదేలే.. కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు, పెన్షన్లు.. జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు
రాష్ట్రపతి సెల్యూట్ చేసిన తర్వాత పరేడ్ ప్రారంభమవుతుంది. పరేడ్‌లో భాగంగా త్రివిధ దళాలు మార్చ్ నిర్వహిస్తాయి. సైనికులు 1947 నుంచి ఇప్పటివరకు ధరించిన వివిధరకాల యూనిఫాంలతో పాటు ఆయుధాలను ప్రదర్శిస్తారు. అనంతరం 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, 9 మంత్రిత్వ శాఖలకు సంబంధించి 21 శకటాల ప్రదర్శన ఉంటుంది.
గణతంత్ర దినోత్సవాల్లో ఈసారి యుద్ధ విమానాలు అందర్నీ ఆకర్షించనున్నాయి. 75 విమానాలతో ఫ్లై పాస్ట్ చేయాలని రక్షణ శాఖ నిర్ణయించింది. ఈ 75 యుద్ధ విమానాల్లో పాత విమానాలు, కొత్త విమానాలు కూడా ఉండనున్నాయి. సుఖోయ్, రాఫెల్, జాగ్వర్, ఎంఐ-17, సారంగ్, అపాచీ, డకోటాతో పాటు రాహత్, మేఘన, ఏకలవ్య, త్రిశూల్, తిరంగా, విజయ్, అమృత్ లాంటి వాటిని కూడా ప్రదర్శించననున్నారు.
AP New Districts : ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
వీటిని వీక్షించేందుకు ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. రక్షణ రంగంలోని వివిధ కీలక ఘట్టాలు, షార్ట్ ఫిల్మ్‌లు, సాయుధ దళాలకు సంబంధించిన వీడియోలను కూడా ప్రదర్శించనుంది రక్షణ శాఖ. రిపబ్లిక్ డే పరేడ్‌ను వీక్షించేందుకు ఇప్పటికే సందర్శకులు రాజ్‌పథ్ చేరుకున్నారు. ఈ వేడుకల్లో తొలిసారి 480 కళాకారులతో సాంస్కృతిక ప్రదర్శన ఏర్పాటు చేశారు.
- Somu Veerraju On Alliance : బీజేపీ-జనసేన పొత్తు.. సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు
- ప్రపంచ ఆరోగ్య సంస్థపై ప్రధాని కీలక వ్యాఖ్యలు
- PM Modi: డబ్ల్యూహెచ్ఓలో సంస్కరణలు అవసరం: మోదీ
- PM Modi: మోదీ గురించి పుస్తకమంటే రాజకీయ నాయకులకు భగవద్గీత లాంటిది – అమిత్ షా
- Minister KTR : చేనేతకు వెన్నుపోటు పొడిచిన ఏకైక ప్రధాని మోడీ : మంత్రి కేటీఆర్
1IPL2022 Lucknow Vs RR : లక్నోకి రాజస్తాన్ షాక్.. కీలక మ్యాచ్‌లో ఘన విజయం
2Telangana Covid Update News : తెలంగాణలో తగ్గిన కరోనా.. కొత్తగా ఎన్ని కేసులు అంటే
3Quality Education: చక్కని విద్య కావాలంటూ సీఎంకు కన్నీళ్లతో బాలుడి వినతి
4IPL2022 Rajasthan Vs LSG : రాజస్తాన్ వర్సెస్ లక్నో.. రాహుల్ సేన టార్గెట్ ఎంతంటే..
5Legend 2: బోయపాటితో అఖండ నిర్మాత ప్లాన్.. లెజెండ్ సీక్వెల్ చేస్తున్నారా?
6Vikram Trailer: కమల్ ఉగ్రరూపం.. గూస్‌బంమ్స్ తెప్పిస్తున్న విక్రమ్ ట్రైలర్!
7Anand Mahindra: మన టైం వచ్చేసింది – ఆనంద్ మహీంద్రా
8Pushpa 2: సినిమా మొదలే కాలేదు.. రూ.600 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్?
9Mouni Roy: తగ్గేదేలే.. పెళ్ళైనా కిల్లర్ లుక్స్!
10Girl Died : యాదగిరిగుట్టలో విషాదం… పుష్కరిణిలో పుణ్యస్నానానికి దిగి బాలిక మృతి
-
Unwilling Marriages : అమ్మాయిలకు శాపంగా మారుతున్న ఇష్టం లేని పెళ్లిళ్లు
-
Congress Party : కీలక మార్పులకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్
-
Sonia Gandhi : కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌కు..’భారత్ జోడో యాత్ర’ : సోనియా గాంధీ
-
Plastic Rice : రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ రైస్ కలకలం
-
Rahul Gandhi : సబ్ కా సాథ్ ఒక్క కాంగ్రెస్‌తోనే సాధ్యం : రాహుల్ గాంధీ
-
Guinness World Record: 75ఏళ్ల వ్యక్తి చేసిన ఈ ఫీట్‌తో గిన్నీస్ వరల్డ్ రికార్డ్
-
CWC : ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌కు ఆమోదం.. అధికారంలోకి వస్తే ఈవీఎంల బదులు పేపర్ బ్యాలెట్!
-
Thomas Cup 2022 : థామస్ కప్ భారత్ కైవసం.. డబుల్స్ లో ఇండోనేషియాపై విజయం