Covid Cases : 75శాతం కరోనా కేసులు ఆ 10 రాష్ట్రాల్లోనే.. కర్నాటకలో అత్యధికంగా 6లక్షల మంది బాధితులు

దేశంలో కరోనా తీవ్రత నెమ్మదిగా తగ్గుతోంది. గత ఐదు రోజులుగా నమోదవుతున్న కేసులు, రికవరీ అవుతున్న వారి గణాంకాలే ఇందుకు నిదర్శనం. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే అధికంగా 1.01లక్షల మంది కరోనా నుంచి కోలుకోవడం ద్వారా యాక్టివ్‌ కేసుల సంఖ్య 35,16,997కు తగ్గిందని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. కొత్తగా 2.81లక్షల మంది కరోనా బారిన పడగా, మే 9 తర్వాత ఇంత తక్కువ

Covid Cases : 75శాతం కరోనా కేసులు ఆ 10 రాష్ట్రాల్లోనే.. కర్నాటకలో అత్యధికంగా 6లక్షల మంది బాధితులు

Covid Cases

Covid Cases : దేశంలో కరోనా తీవ్రత నెమ్మదిగా తగ్గుతోంది. గత ఐదు రోజులుగా నమోదవుతున్న కేసులు, రికవరీ అవుతున్న వారి గణాంకాలే ఇందుకు నిదర్శనం. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే అధికంగా 1.01లక్షల మంది కరోనా నుంచి కోలుకోవడం ద్వారా యాక్టివ్‌ కేసుల సంఖ్య 35,16,997కు తగ్గిందని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. కొత్తగా 2.81లక్షల మంది కరోనా బారిన పడగా, మే 9 తర్వాత ఇంత తక్కువ కేసులు నమోదవడం ఇదే. పాజిటివిటీ రేటు 18.17శాతానికి తగ్గడం గమనార్హం. ఇక మరణాల రేటు కూడా 1.10శాతంగా ఉన్నట్లు ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది.

ఇక 75.04శాతం కేసులు పది రాష్ట్రాల్లోనే నమోదవుతున్నట్లు తెలిపింది. కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌,
పశ్చిమబెంగాల్‌, గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో అత్యధికంగా వస్తున్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 34,389 మంది కరోనా బారిన పడగా, ఆ తర్వాత
తమిళనాడులో 33,181 కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలోని అత్యధిక జిల్లాల్లో పాజిటివిటీ రేటు 20శాతంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

గత 24 గంటల్లో కరోనాతో 4వేల 106మంది చనిపోయారు. అత్యధికంగా మహారాష్ట్రలో 974మంది మృతి చెందగా, కర్ణాటకలో 403మంది చనిపోయారు. ఇప్పటి వరకూ 18.30కోట్ల వ్యాక్సిన్‌ డోసులను కేంద్ర ప్రభుత్వం అందించింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7లక్షల మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారు.

10 రాష్ట్రాల్లో 75శాతం యాక్టివ్ కేసులు(లక్షకు పైనే)
కర్నాటక – 6లక్షల 168 కేసులు
మహారాష్ట్ర – 4లక్షల 70వేల 595 కేసులు
కేరళ – 4లక్షల 41వేల 011 కేసులు
తమిళనాడు – 2లక్షల 19వేల 342 కేసులు
ఆంధ్రప్రదేశ్ – 2లక్షల 10వేల 436 కేసులు
రాజస్తాన్ – ఒక లక్ష 94వేల 382 కేసులు
ఉత్తరప్రదేశ్ – ఒక లక్ష 63వేల 003 కేసులు
వెస్ట్ బెంగాల్ – ఒక లక్ష 31వేల 805 కేసులు
గుజరాత్ – ఒక లక్ష 04వేల 908 కేసులు
ఛత్తీస్ గఢ్ – ఒక లక్ష 3వేల 593 కేసులు