COVID Wave In India : కరోనా సెకండ్ వేవ్..776 మంది వైద్యులు మృతి

సెకండ్ వేవ్ లో 776 మంది వైద్యులు మృతి చెందారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) వెల్లడించింది. అత్యధికంగా బీహార్ రాష్ట్రంలో 115 మంది మృతి చెందగా..తర్వాతి స్థానంలో ఢిల్లీ (109) నిలిచింది. ఉత్తర్ ప్రదేశ్ లో 79 మంది వైద్యులు, రాజస్థాన్ లో 44, ఏపీలో 40, తెలంగాణ రాష్ట్రంలో 37 మంది చనిపోయారని వెల్లడించింది.

COVID Wave In India : కరోనా సెకండ్ వేవ్..776 మంది వైద్యులు మృతి

Doctors

776 Doctors : భారత్‌‌లో కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో ఇంకా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గతంలో కన్నా తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతుండడం ఊరటనిచ్చే విషయం. అయితే కరోనా రోగులకు వైద్యం అందిస్తున్న డాక్టర్స్ కూడా ఈ వైరస్ బారిన పడి చినిపోతుండడం బాధాకరం. కరోనా మొదటి వేవ్ లో కూడా వైద్యులు చనిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా..సెకండ్ వేవ్ లో 776 మంది వైద్యులు మృతి చెందారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) వెల్లడించింది.

అత్యధికంగా బీహార్ రాష్ట్రంలో 115 మంది మృతి చెందగా..తర్వాతి స్థానంలో ఢిల్లీ (109) నిలిచింది. ఉత్తర్ ప్రదేశ్ లో 79 మంది వైద్యులు, రాజస్థాన్ లో 44, ఏపీలో 40, తెలంగాణ రాష్ట్రంలో 37 మంది చనిపోయారని వెల్లడించింది. ఇప్పటి వరకు రెండు విడతల్లో (కరోనా మొదటి, రెండోది) వేయి 524 మంది వైద్యులు మృతి చెందారని తెలిపింది.

మరోవైపు భారతదేశంలో కరోనా ఉధృతితో గురువారం నాడు 51,667 క‌రోనా కేసులు నమోదు కాగా దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,01,34,445కు చేరింది. అలాగే గురువారం ఒక్కరోజే 1329మంది మృతి చెందటంతో మొత్తం మృతుల సంఖ్య 3,93,310కు చేరింది. 30,79,48,744 వ్యాక్సిన్ డోసులు వేసినట్లుగా కేంద్రం వెల్లడించింది. అలాగే కరోనా సోకి 24 గంట‌ల్లో 64,527 మంది కోలుకున్నారు.