Monkeypox Virus: వణికిస్తున్న మంకీపాక్స్.. 27దేశాల్లో వైరస్ వ్యాప్తి .. భారత్‌లో..

మంకీపాక్స్ వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజురోజుకు ఈ వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మే 13 నుంచి జూన్‌ 2వ తేదీ దాకా 27 దేశాల్లో 780 మంకీపాక్స్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకటించింది.

Monkeypox Virus: వణికిస్తున్న మంకీపాక్స్.. 27దేశాల్లో వైరస్ వ్యాప్తి .. భారత్‌లో..

Monkey Pox

Monkeypox Virus: మంకీపాక్స్ వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజురోజుకు ఈ వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మే 13 నుంచి జూన్‌ 2వ తేదీ దాకా 27 దేశాల్లో 780 మంకీపాక్స్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకటించింది. మే 13వ తేదీ నాటికి ప్రపంచంలో 257 మంకీపాక్స్‌ కేసులు బయటపడగా ఆ తర్వాతి నుంచి ఈ నెల 2 దాకా 780 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇదిలాఉంటే ఈ ఏడాది ఇప్పటివరకు మంకీపాక్స్‌ వల్ల ఏడు దేశాల్లో 66 మరణాలు నమోదైనట్లు డబ్ల్యూహెచ్ ఓ వెల్లడించింది. మంకీపాక్స్ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఇప్పటికే పలు దేశాలు కఠిన చర్యలు చేపట్టాయి. మంకీపాక్స్ వైరస్ పై అవగాహన కల్పిస్తూ ఆయా దేశాల ప్రభుత్వాలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి.

ఇదిలాఉంటే భారతదేశంలోనూ మంకీపాక్స్ వైరస్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లో మంకీపాక్స్‌ లక్షణాలు బయటకు వచ్చాయి. యూపీలోని ఘజియాబాద్‌లో ఐదేళ్ల చిన్నారిలో మంకీపాక్స్‌ లక్షణాలు బయటపడ్డాయి. బాధితురాలి శరీరంపై దద్దర్లు రాగా, దురద ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. దీంతో, శాంపిల్స్‌ సేకరించి పూణేలోని ల్యాబ్‌కు టెస్ట్‌ కోసం పంపినట్టు చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ తెలిపారు. ఇక, చిన్నారి కుటుంబానికి ఎలాంటి ట్రావెల్‌ హిస్టరీ లేదని వైద్యులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. మంకీపాక్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, వైరస్ వ్యాప్తి పెరగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఇటీవల మంకీ పాక్స్ ప్రబలుతున్న దేశాలకు వెళ్లి వచ్చిన వారు, ఒంటిపై రాషెస్ వచ్చిన వారి ఆరోగ్యాన్ని గమనిస్తు ఉండాలని ఆయా రాష్ట్రాల అధికారులను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

Cases Of Monkeypox In Non Endemic Countries Reported To Or Identified By Who From Official Public Sources Between 13 May And 2 June 2022,

Cases Of Monkeypox In Non Endemic Countries Reported To Or Identified By Who From Official Public Sources Between 13 May And 2 June 2022,