మరో ఘాతుకం : ఇద్దరు బాలికలపై ఎనిమిదిమంది యువకులు గ్యాంగ్ రేప్..ప్రాణాలతో పోరాడుతున్న బాధితులు

మరో ఘాతుకం : ఇద్దరు బాలికలపై ఎనిమిదిమంది యువకులు గ్యాంగ్ రేప్..ప్రాణాలతో పోరాడుతున్న బాధితులు

8 Men Gang Rape Two Girls In Tripura (1)

8 Men Gang Rape Two Girls In Tripura : ఆడపుట్టుకలపై జరిగిన అరాచకాలకు..అకృత్యాలకు..అత్యాచారాలకు ఏమాత్రం తగ్గట్లేదు. పసిమొగ్గలను సైతం చిదిమేస్తున్న మృగాళ్ల కామాదాహం అంతకంతకూ పెరుగుతోంది. దేశంలో అంతకంతకూ పెరుగుతున్న అత్యాచారాలు ఆడపుట్టుకలనే ప్రశ్నార్థం చేస్తున్నాయి. ఈ క్రమంలో మరో ఇద్దరు పసిమొగ్గలపై మృగాళ్లు పంజా విసిరారు. ఇద్దరు బాలికపై ఏకంగా ఎనిమిదిమంది కామాంధులు అత్యాచారానికి తెగబడిన దారుణ ఘటన త్రిపుర రాష్ట్రంలో జరిగింది. ఇద్దరు బాలికలను అడవిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి తెగబడ్డారు ఎనిమిది మంది యువకులు. కామాంధులు దారుణానికి బలైన ఇద్దరు బాధిత బాలికల్లో ఓ బాలిక చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.

త్రిపురలోని ఖౌవాయి జిల్లాలో జరిగిన ఈ ఘటనతో స్థానికులంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఆడబిడ్డల తల్లులు భయంతో తల్లడిల్లిపోయారు. తమ బిడ్డలను గుండెలకు అదుముకున్నారు. ఖిటియాబరి ప్రాంతానికి చెందిన 14,15 సంవత్సరాల వయస్సున్న ఇద్దరు బాలికలు తమ ఇద్దరు స్నేహితులతో కలిసి హోలీ జరుపుకోవటానికి గత సోమవారం (మార్చి 29,2021) సాయంత్రం బైక్ పైచ బయటకు వెళ్లారు. అలా వారు కొంతదూరం వెళ్లాక వారిని మరో ఆరుగురు యువకులు బైక్ లపై వచ్చి కలిసారు.

అలా ఎనిమిది మంది ఏకమై ఆ ఇద్దరు బాలికలను సమీపంలో ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణంతో బాలికలు అపస్మారస్థితిలోకి వెళ్లిపోవటంతో వారు చనిపోయారనీ..తాము ఎక్కడ దొరికిపోతామనే భయంతో ఎనిమిదిమంది యువకులు అక్కడ నుంచి పరారైపోయారు.

సాయంత్రం అనగా బయటకు వెళ్లినవారు ఇంకా ఇంటికి రాకపోవటంతో సదరు బాధిత బాలిక తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. తెలిసివాళ్లను..బాలికల స్నేహితులను అడిగారు. తమ ఇంటికి రాలేదని చెప్పటంతో భయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారితో కలిసి గాలింపు చేపట్టారు.

అలా వెదుకుతుండగా సమీపంలోని అటవీ ప్రాంతంలో అపస్మార స్థితిలో పడి ఉన్న బాలికలు కనిపించారు. తమ బిడ్డలను ఆ స్థితిలో చూసేసరికి తల్లిదండ్రులు, బంధువులు తల్లడిల్లిపోయారు. వెంటనే పోలీసుల సహాయంతో హాస్పిటల్ కు తరలించారు. వారికి చికిత్స నందిస్తున్నారు. వీరిలో ఓ బాలిక పరిస్థితి విషమించటంతో మెరుగైన చికిత్స్ కోసం మరో ఆస్పత్రికి తరలిచించారు. బాలికల వాంగ్ములంతో వారిపై అత్యాచారం జరిగిందని తెలుసుకున్న పోలీసులు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి నిదుతుల కోసం గాలింపు చేపట్టారు.

ఈ క్రమంలో బాలికలను తీసుకెళ్లింది..వారిని వెంబడించింది ఎవరో కనిపెట్టారు. అనంతరం నిందితులు జాగు డెబ్బర్మా, బిమల్ డెబ్బర్మా, మైఖేల్ డెబ్బార్మా, హృషిత్ డెబ్బర్మా, నిషిత్ డెబ్బార్మా, సోయల్ డెబ్బార్మా, బీరేష్ డెబ్బర్మా, బికాష్ డెబ్బర్మాలుగా గుర్తించి వారిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.