R-Factor : కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగియలేదు..8 రాష్ట్రాల్లో ఆందోళనకరంగా ఆర్-ఫ్యాక్టర్

దేశంలో కోవిడ్ వైరస్ ఉధృతి కొనసాగుతోంది. రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది.

R-Factor : కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగియలేదు..8 రాష్ట్రాల్లో ఆందోళనకరంగా ఆర్-ఫ్యాక్టర్

People

R-Factor దేశంలో కోవిడ్ వైరస్ ఉధృతి కొనసాగుతోంది. రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. అయితే పలు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉందని మంగళవారం కేంద్రప్రభుత్వం తెలిపింది. కేరళ, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్, మణిపుర్, అరుణాచల్​ప్రదేశ్ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందని కేంద్రం తెలిపింది. గతవారం నమోదైన మొత్తం కేసుల్లో 49.85 శాతం ఒక్క కేరళలోనే వెలుగుచూసినట్లు వివరించింది. గత నాలుగు వారాలుగా ఆరు రాష్ట్రాల్లోని 18 జిల్లాల్లో రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోందని తెలిపింది. 2 రాష్ట్రాల్లోని 44 జిల్లాల్లో కరోనా వీక్లీ పాజిటివిటీ రేటు 10 శాతానికి మించి నమోదైనట్లు తెలిపింది.

ఇక, ఎనిమిది రాష్ట్రాల్లో..కొవిడ్ వ్యాప్తిని సూచించే రీప్రొడక్టివ్ నెంబర్ (ఆర్​ ఫ్యాక్టర్) ఒకటికి మించినట్లు ఆరోగ్యవాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. మంగళవారం లవ్ అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ…అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, భారత్​లో ఆర్​ ఫ్యాక్టర్​ సగటున 1.2గా ఉంది. అంటే కోవిడ్ సోకిన వ్యక్తి వల్ల ఒకరి కన్నా ఎక్కువ మందికి వైరస్​ వ్యాపిస్తోంది. భారత్​లోని 8 రాష్ట్రాల్లో ఆర్​ ఫ్యాక్టర్​ అధికంగా ఉంది. వైరస్ వ్యాప్తి రేటు, యాక్టివ్ కేసుల సంఖ్య ఆర్ ఫ్యాక్టర్​పైనే ఆధారపడి ఉంటుంది. ఆర్​ ఫ్యాక్టర్​ ఒకటికన్నా ఎక్కువ ఉందంటే.. కేసులు పెరుగుతున్నాయని, నియంత్రణ చర్యలు చేపట్టాల్సిన అవసరముందని అర్థం. ప్రపంచ దేశాల్లో ఇప్పటికీ అధిక సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా మహమ్మారి ఇంకా పోలేదు. భారత్​ విషయానికి వస్తే కరోనా రెండో దశ ఇంకా ముగియలేదు. 44 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10శాతం కన్నా ఎక్కువ ఉందని తెలిపారు.

ఆర్- ఫ్యాక్ట‌ర్ అంటే ఏంటీ
ఆర్- ఫ్యాక్ట‌ర్ అంటే రీ-ప్రోడ‌క్ష‌న్ రేటు. ఒక కోవిడ్ రోగి ఎంత‌మందికి కోవిడ్ స్ప్రెడ్ చేయ‌గ‌ల‌డు అనేది ఈ రీ- ప్రొడ‌క్ష‌న్ రేటు చెబుతుంది. ఆర్- ఫ్యాక్ట‌ర్ క‌నుక 1.0 కంటే ఎక్కువ ఉంటే కేసులు ఎక్కువ‌ అవుతున్న‌ట్టు లెక్క‌. అదే స‌మ‌యంలో ఆర్- ఫ్యాక్ట‌ర్ 1.0 క‌న్నా త‌క్కువ ఉన్నా.. కేసుల‌లో త‌గ్గుద‌ల క‌నిపిస్తున్నా.. పాజిటివ్ కేసులు త‌గ్గుతున్న‌ట్టు భావించాల‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు, ఒక వంద‌ మంది కోవిడ్ బాధితుల ద్వారా మ‌రో వంద‌మందికి క‌రోనా సోకిందంటే.. అప్పుడు ఆర్- ఫ్యాక్టర్‌ విలువ ఒకటిగా ఉంటుంది. అదే వంద‌మంది కేవ‌లం 80 మందికి మాత్ర‌మే వైరస్‌ను వ్యాపింప‌చేయ‌గ‌లిగితే అప్పుడు ఆర్‌- ఫ్యాక్టర్‌ 0.80కు ప‌రిమిత‌మ‌వుతుంది.