Action immediately : కరోనా కేసుల కట్టడికి కఠిన చర్యలు తీసుకోండి.. 8 రాష్ట్రాలకు కేంద్రం లేఖ

కరోనా కేసులు తీవ్రంగా ఉన్న 8 రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసింది. కఠిన చర్యలు తీసుకోవాలని లేఖ రాసింది.

Action immediately : కరోనా కేసుల కట్టడికి కఠిన చర్యలు తీసుకోండి.. 8 రాష్ట్రాలకు కేంద్రం లేఖ

Letter To The Center 8 States For Corona Control (1)

Letter to the Center 8 States for Corona Control : ఒకవైపు దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నాయని సంతోషిస్తున్న క్రమంలో కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పరిస్థితి భిన్నంగా ఉంది. దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల్లో కరోనా కేసుల నమోదు చూస్తుంటే ఆందోళనకరంగానే ఉంది. ఈక్రమంలో కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాలకు లేఖలు రాసింది. కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని సూచనలు చేసింది. ప్రతీ రాష్టంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని..కరోనా నిబంధనల్ని పాటించేలా చేయాలని దీని కోసం కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషన్ ఆయా రాష్ట్రాల అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ లేఖలు రాసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాసిన లేఖ రాసిన రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, అసోం, మణిపూర్, కేరళ, మేఘాలయ, ఒడిశా, త్రిపుర, సిక్కిం ఉన్నాయి. ఈ రాష్ట్రాలకుకరోనా కట్టడికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపింది.

ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ మాట్లాడుతూ..దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ ముందస్తు మెచ్చరికలు పాటించాలని తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణకు సామూహిక ప్రయత్నాలు అత్యవసరమని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది చాలా అవసరమని స్పష్టం చేశారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని 25 జిల్లాల్లో కరోనా వ్యాప్తి రేటు అత్యధికంగా 19 శాతం ఉన్నా..పాజిటివిటీ రేటును 10 శాతానికిపైగా ఉందని..ఇది ఆందోళన కలిగించే అంశమని అన్నారు. వారానికి 12 శాతం కొత్త కేసులు నమోదు అవుతున్నాయని దీంతో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

అలాగే మణిపూర్ లోని 16 జిల్లాలో కూడా కరోనా కేసులు అత్యధికంగా ఉన్నాయని వెల్లడించారు. మేఘాలయలో కరోనా వ్యాప్తి రేటు 14.05 శాతంగా ఉన్నదని, అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. అస్సాంలో కూడా కేసులు ఆందోలన కలిగించేలా ఉన్నాయని అస్సాం ప్రధాన కార్యదర్శి ఆందోళన వ్యక్తం చేశారు.

కాగా..దేశవ్యాప్తంగా కరోనా కొత్తకేసులు నమోదు అవుతునూ ఉన్నాయి. ఓ పక్క పెరుగుతుంటే మరోపక్క పెరుగుతున్నాయి. బుధవారం (జులై 7,2021) ఒక్కసారిగా 26 శాతం కేసులు ఒకే రోజులో పెరగడంతో కేంద్రం ఆందోళన వ్యక్తం అవుతోంది. గత 24 గంటల్లో 43,733 కొత్త కేసులు నమోదు కాగా భారత ఆరోగ్య శాఖ అందించిన తాజా లెక్కల ప్రకారం మొత్తం దేశంలో కరోనా కేసులు సంఖ్య 3,06,63,665 కు చేరుకుంది.