Mathura: : లాక్ చేసిన కారులో ఇరుక్కుని బాలుడు మృతి

మధురలో ఓ ఘటన చోటు చేసుకుంది. లాక్ చేసిన కారులో 8 ఏళ్ల బాలుడు ఊపిరి ఆడకపోవడంతో చనిపోయాడు. బాలుడు కృష్ణుడిగా గుర్తించారు. కృష్ణుడు తండ్రికి ఐదుగురు సంతానం కాగా..ఇతను ఏకైక కుమారుడు.

10TV Telugu News

Locked Inside Car : కారు లాక్ చేసిన తర్వాత..సరిగ్గా చెక్ చేసుకోవాలని, చిన్నారులు ఎక్కి ఆడుతూ..ప్రమాదవశాత్తు కారులో ఇరుక్కుని ఊపిరాడక చనిపోతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇలాగే మధురలో ఓ ఘటన చోటు చేసుకుంది. లాక్ చేసిన కారులో 8 ఏళ్ల బాలుడు ఊపిరి ఆడకపోవడంతో చనిపోయాడు.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని మధుర జిల్లాలో Barari ప్రాంతంలో 8 ఏళ్ల బాలుడు తండ్రికి టీ ఇవ్వడానికి వెళ్లాడని బాధితుడి మామ గిరీష్ అగర్వాల్ వెల్లడించారు. అయితే..తిరిగి ఎంతకు తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన తండ్రి…బాలుడిని వెతకాలని ఓ వ్యక్తికి చెప్పాడని వెల్లడించారు. సమీపంలో పార్కు చేసిన కారులో బాలుడు అపస్మారక స్థితిలో ఉండడం చూసి షాక్ కు గురయ్యామన్నారు. ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా…చనిపోయాడని వైద్యులు వెల్లడించారని తెలిపారు. కారులో బాలుడు వీడియో గేమ్ ఆడుతున్నట్లు తెలుస్తోంది.

మృతి చెందిన బాలుడు కృష్ణుడిగా గుర్తించారు. కృష్ణుడు తండ్రికి ఐదుగురు సంతానం కాగా..ఇతను ఏకైక కుమారుడు. మరణానికి ముందు రెండు సెల్ఫీలు తీసుకున్నట్లు, అందులో అతను చాలా చెమటతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇంకా తమకు ఫిర్యాదు ఏమీ అందలేదని పోలీసులు వెల్లడించారు. మే నెలలో బాగ్ పట్ లోని సింగౌలిటాగా గ్రామంలో ఇద్దరు బాలికలతో సహా నలుగురు పిల్లలు కారులో చిక్కుకుని ఊపిరిఆడకుండా చనిపోయారు.