Doctors Covid : దయనీయం.. ఒకే ఆసుపత్రిలో 80మంది డాక్టర్లకు కరోనా, అయినా బాధితులకు ఆగని చికిత్స

ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. 80 మంది డాక్టర్లు కరోనా బారిన పడ్డారు. పైగా వారంతా ఒకే ఆసుపత్రికి చెందిన వారే. అందులో ఒక శస్త్రచికిత్స నిపుణుడు మహమ్మారికి బలయ్యారు. అయినా ఆ ఆసుపత్రి వైద్యులు తన ధర్మం మరిచిపోకుండా కరోనా బాధితులకు చికిత్స

Doctors Covid : దయనీయం.. ఒకే ఆసుపత్రిలో 80మంది డాక్టర్లకు కరోనా, అయినా బాధితులకు ఆగని చికిత్స

Doctors Covid Positive

Doctors Covid Positive : ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. 80 మంది డాక్టర్లు కరోనా బారిన పడ్డారు. పైగా వారంతా ఒకే ఆసుపత్రికి చెందిన వారే. అందులో ఒక శస్త్రచికిత్స నిపుణుడు మహమ్మారికి బలయ్యారు. అయినా ఆ ఆసుపత్రి వైద్యులు తన ధర్మం మరిచిపోకుండా కరోనా బాధితులకు చికిత్స చేస్తూనే ఉన్నారు. అయితే, అవుట్ పేషెంట్ విభాగాన్ని మాత్రం కొన్ని రోజుల పాటు బంద్ పెట్టింది. ఇదీ ఢిల్లీలోని సరోజ్ హాస్పిటల్ లో ఉన్న దీన పరిస్థితి.

ప్రస్తుతం కరోనా బారిన పడిన వైద్యుల్లో 12 మందికి ఆసుపత్రిలో చికిత్స చేస్తుండగా.. దాదాపు 30 ఏళ్ల పాటు సరోజ్ లో శస్త్రచికిత్స నిపుణుడిగా పనిచేసిన డాక్టర్ ఎ.కె. రావత్ కన్నుమూశారు. మిగతా వారంతా ఇంట్లోనే క్వారంటైన్ లో ఉన్నారు. కాగా, సెకండ్ వేవ్ లో ఇప్పటిదాకా 300 మంది వైద్యులు, పారామెడికల్ సిబ్బంది కరోనా బారిన పడినట్టు చెబుతున్నారు.

ఢిల్లీలో మరో విషాదం చోటు చేసుకుంది. యువ డాక్టర్ కరోనాకు బలయ్యాడు. పాజిటివ్ అని రిపోర్టు వచ్చిన గంటల వ్యవధిలోనే ఆ డాక్టర్ కన్నుమూశాడు. అనాస్ ముజాహిద్ (26) అనే డాక్టర్.. గురు తేజ్ బహదూర్ ఆసుపత్రిలో పని చేస్తున్నాడు. జనవరిలో ఎంబీబీఎస్ ఇంటర్న్ షిప్ పూర్తి చేశాడు. ఎంతో కెరీర్ ఉన్న డాక్టర్ ను కరోనా బలితీసుకోవడం తీవ్ర విషాదం నింపింది. కాగా, గురు తేజ్ బహదూర్ ఆసుపత్రిని డెడికేటేడ్ కోవిడ్ ఆసుపత్రిగా మార్చారు.

ఢిల్లీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. తాజాగా 13వేల 336 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 273మంది కోవిడ్ తో చనిపోయారు.