Bibiji Juice : 80 ఏళ్ల బామ్మ జ్యూస్‌ స్టాల్..ఆమె ఆత్మవిశ్వానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

80 ఏళ్ల బామ్మ జ్యూస్ స్టాల్ నడుపుతున్నారు. ఆమె తయారు చేసే జ్యూసులకు భలే గిరాకీ. చకాచకా బత్తాయి రసం తీసేస్తూ .కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. ముదిమి వయసులో కూడా జ్యూస్‌ బండి ద్వారా జీవనాన్ని సాగిస్తూ పదిమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

Bibiji Juice : 80 ఏళ్ల బామ్మ జ్యూస్‌ స్టాల్..ఆమె ఆత్మవిశ్వానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

Amritsar Bibiji Juice Stall

అమ్మచేతి వంట కమ్మదనం ఎవరు చేసినా రాదు. అదీ అమ్మచేతి మహత్యం.ప్రేమ, మమకారం కలిపి వండుతుంది అమ్మ. అందుకే అంతరుచి ఉంటుంది. అమ్మచేతి వంటే అంతరుచిగా ఉంటే మరి బామ్మ చేత్తో రోటి పచ్చడి చేస్తే..ఇక ఆరుచి గురించి వర్ణించగలమా? ఆరుచి ముందు డైటింగులు ఏమీ గుర్తు కూడా రావు.ఓ నాలుగు ముద్దలు ఎక్కువే లాగించేస్తాం. మరి అటువంటి బామ్మ చేత్తో జ్యూస్ తయారు చేస్తే..ఆ రుచికి అమృతం సరిపోతుందా..అస్సలు సరిపోదు కదూ..నిజమే అనిపిస్తుంది ఈ బామ్మగారి చేత్తో తయారు చేసిన ఓ జ్యూస్ తాగితే. ఆమె పడే కష్టానికి..ఆమె ఆత్మవిశ్వానికి ‘వన్ మోర్ గ్లాస్ ప్లీజ్’అని అనాల్సిందే. అదీ పంజాబ్‌కు చెందిన జ్యూస్‌ స్టాల్‌ బామ్మ గారి జ్యూస్ ల టేస్ట్. వారెవ్వా అనిపిస్తుంది.

వయస్సు జస్ట్‌ ఒక నంబరు మాత్రమేనంటున్నారు ఈరోజుల్లో ఎంతోమంది బామ్మలు. వయస్సు అనేది అసలు సమస్యేకాదంటున్నారు బిజినెస్ లో బిజీ బిజీ అయిపోతున్న బామ్మలు.ఎనిమిది పదులే కాదు తొమ్మిది పదులు దాటినా ఐ డోంట్ కేర్ అంటు..మాకు మేమే సాటి అంటూ తమ టాలెంట్‌తో ఇంటర్నెట్‌లో సంచలనంగా మారుతున్నారు బామ్మలు. తాజాగా పంజాబ్‌కు చెందిన జ్యూస్‌ స్టాల్‌ బామ్మ ట్రెండ్ అయిపోయారు. సోషల్ మీడియా క్వీన్ అయిపోయారు తన టేస్టీ టేస్టీ జ్యూస్ లతో..

అమృత్‌సర్‌లోని 80 ఏళ్ల బామ్మ జ్యూస్ స్టాల్ నడుపుతున్నారు. ఆమె తయారు చేసే జ్యూసులకు భలే గిరాకీ. చకాచకా బత్తాయి రసం తీసేస్తూ .కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. ముదిమి వయసులో కూడా జ్యూస్‌ బండి ద్వారా జీవనాన్ని సాగిస్తూ పదిమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈ వయసులో కూడా బామ్మగారు ఎంత కష్టపడుతున్నారో..దయచేసిన ఎవరైనా ఆమెకు సాయం చేయండి అంటూ ఒక ట్విటర్‌ యూజర్‌ వీడియోను ట్వీట్‌ చేశారు. అంతే అది క్షణాల్లో వైరల్‌ అయింది. ఆమెకు సాయం చేసేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. వీలైతే ఆమెకు ఒక ఎలక్ట్రానిక్ జ్యూసర్ ఇవ్వాలనుకుంటున్నానని ఒకరు ట్వీట్‌ చేశారు.

కాగా యుక్త వయస్సులో ఉండి కూడా కష్టపడకుండా..ఒక్కరూపాయం సంపాదించకుండా సోమరిపోతుల్లా తిరుగుతూ..డబ్బుల కోసం తల్లుల్ని..భార్యల్ని, బిడ్డల్ని వేధించేవారికి ఈ బామ్మగారి చూసి సిగ్గుపడాలి.ఎంతోమందికి ఈ బామ్మ స్ఫూర్తిదాయకమని చెప్పాల్సిందే. ఆ వయస్సులో కూడా సొంతంగా కష్టపడి సంపాదించాలనే ామె ఆత్మవిశ్వాసానికి హ్యాట్సాఫ్ చెప్పి తీరాల్సిందే.