కల నెరవేరింది : రామ మందిరం కోసం 87ఏళ్ల వృద్ధురాలి దీక్ష: పాలు..పండ్లే ఆహారం

  • Published By: veegamteam ,Published On : November 12, 2019 / 05:33 AM IST
కల నెరవేరింది : రామ మందిరం కోసం 87ఏళ్ల వృద్ధురాలి దీక్ష: పాలు..పండ్లే ఆహారం

అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం 81 సంవత్సరాల వృద్ధురాలు గత 27 ఏళ్ల నుంచి దీక్ష చేస్తోంది. కేవలం పండ్లు, పాలు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ దీక్షను చేస్తోంది. ఆమె పేరు ఉర్మిళా చతుర్వేది.ఆమెది మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ లోని విజయ నగర్‌‌. సంస్కృత ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణం కోసం నిర్ణయం జరిగేదాకా పాలు, పళ్లు మాత్రమే తింటానని  ఉర్మిళా చతుర్వేది ప్రతిన బూనారు.

శ్రీరాముడికి పరమ రామభక్తురాలైన ఆమెను 1992డిసెంబరు 6న అయోధ్యలో బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేయడం.. అనంతరం చెలరేగిన అల్లర్లు ఆమెను తీవ్రంగా కలిచివేశాయి. నాటినుంచి స్నేహపూర్వకంగా పరిష్కరామై..మందిర నిర్మాణానికి మార్గం సుగమం అయ్యేదాకా పాక్షిక ఉపవాసం ఉండాలని నిర్ణయించుకుంది. దీక్ష చేపట్టినప్పుడు ఆమెకు 54 ఏళ్లు. రామ మందిరం నిర్మాణానికి మార్గం సుగమమం చేస్తు దేశ అత్యున్నత న్యాయం స్థానం చారిత్రాత్మక తీర్పునిచ్చింది. దీంతో ఆమె కల నెరవేరనుంది. దీంతో త్వరలోనే ఆమె దీక్ష విరమణ ఉద్యాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆమె కుమారుడు చెప్పాడు.

తన దీక్ష గురించి ఊర్మిళా చతుర్వేది మాట్లాడుతూ..అయోధ్యలో రామ మందిరం నిర్మాణం  నా కల అని.. సుప్రీంకోర్టు తీర్పుతో తన కల నెరవేతున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. హిందూ ముస్లింల మధ్య ఏర్పడిన ఈ రామ మందిర వివాదం సామరస్యంగా పూర్తి అవ్వాలని తాను ఎంతగానో కోరుకున్నాననీ..సుప్రీంకోర్టు తీర్పుతో అది జరిగిందనీ తన ఆనందానికి అవద్ధుల్లేవని  ఊర్మిళా చతుర్వేది తెలిపారు.

తీర్పు వెలవడే రోజున తాను టీవీకి అతుక్కుపోయి చాలా ఉత్కంఠగా తీర్పు కోసం వేచి చూశానని అన్నారు. తీర్పు వెలువడగానే రాముడికి సాష్టాంగ నమస్కారం చేస్తు ప్రత్యేక పూజలు చేశానని అన్నారు.  తన 27 సంవత్సరాల కఠిన దీక్షకు తగిన ప్రతిఫలం దక్కిందని ఇదంతా రాముడి ఆశీర్వదమేనని అన్నారు. రాముడి ఆశీర్వాదంతో తన దీక్షను విరమిస్తాననని 81 సంవత్సరాల ఊర్మిళా చతుర్వేది తెలిపారు.