‘After 50 Years..She Found Me’ : 30 ఏళ్లలో తొలిప్రేమ..50 ఏళ్ల తర్వాత ప్రియురాలిని కలవనున్న 82 ఏళ్ల వృద్ధుడు

30 ఏళ్ల వయస్సులో తొలిసారి ప్రేమలో పడిన అమ్మాయికి దూరం అయినా ఓ ప్రేమికుడు. 50 ఏళ్ల తరువాత మళ్లీ తన తొలి ప్రేమను కలుసుకోనున్న 82 ఏళ్ల వృద్ధుడి అరుదైన అద్భుతమైన ప్రేమ కథ. ఇది రీల్ స్టోరీ కాదు రియల్ స్టోరీ.

‘After 50 Years..She Found Me’ : 30 ఏళ్లలో తొలిప్రేమ..50 ఏళ్ల తర్వాత ప్రియురాలిని కలవనున్న 82 ఏళ్ల వృద్ధుడు

82 Year Man From Connects With His First Love After 50 Years

82 Year Man From Connects With His First Love After 50 Years : ప్రేమ. ఇష్క్. కాదల్. లవ్. భాష ఏదైనా ప్రేమ అనేది ఓ అనిర్వచనీయమైన అనుభూతి. నీకు నేనున్నాననే భావన కల్పించేది ప్రేమ. కానీ ప్రేమ అనే మాటలకు అర్థమే లేకుండా చేస్తున్న ఘటనలు చాలానే చూస్తున్నాం. ప్రేమించి మోసం చేసిన ఎంతోమంది గురించి తెలుసే ఉంటుంది. కానీ తన జీవితంలో తొలిసారి ప్రేమించిన యువతిని మరచిపోలేనివాళ్లు చాలా అరుదుగా ఉంటారు. ఇంకా చెప్పాలంటే సినిమాల్లోనే ఉంటారు.  కానీ 30 ఏళ్ల వయస్సులో తొలిచూపులోని ప్రేమించిన ఓ అమ్మాయిని మరచిపోలేని 82 ఏళ్ల వ్యక్తి ఈనాటికి ఆమెను మరచిపోలేదు. చిన్న విషయంలో ప్రేమికులురాలికి దూరమైన ఆ 82ఏళ్ల వ్యక్తి ఇప్పుడు తన తొలి ప్రేమను అంటే తొలిచూపులోనే ప్రేమించిన ప్రేమికురాలిని 50 ఏళ్ల తరువాత కలుసుబోతున్నాడు…! తన తొలిప్రేమను కలుసుకోబుతున్న అతను నవ యువకుడు తెగ సంబరపడిపోతున్నాడు. అటువంటివారి ‘‘పవిత్ర ప్రేమ’’ కథ..ఎలా మొదలైంది? ఎలా విడిపోయారు? ఎందుకు విడిపోయారో తెలుసుకుందాం..

తొలి చూపులోనే ప్రేమలో పడిన ప్రేమికుడు..
రాజస్తాన్‌ జైసల్మేర్‌లోని హాంటెడ్ గ్రామంలో గేట్‌ కీపర్‌గా పని చేస్తున్నాడు 82 ఏళ్ల వృద్ధుడి లవ్ స్టోరీ సినిమా కథలకు ఏమాత్రం తగ్గని ప్రేమకథ. పేరు చెప్పటానికి ఇష్టపడని ఈ ప్రేమికుడు లవ్ స్టోరీ గురించి అతని మాటల్లోనే..‘‘1970లో తొలిసారి ఎడారి సఫారీ కోసం వచ్చిన మెరినాను చూశాను. తొలి చూపులోనే ప్రేమలో పడ్డాను. ఆమె లేనిదే జీవితమే లేదనుకున్నాను. మెరినా ఐదు రోజుల పర్యటన కోసం ఆస్ట్రేలియా నుంచి జైసల్మేర్‌ వచ్చింది. మెరినాను చూడగానే నేను ప్రేమలో పడిపోయాను. తను కూడా అంతే. నన్ను చూడగానే ప్రేమించిందని తెలుసుకుని తెగ సంతోషపడిపోయాను. పర్యటన ముగిసింది. ఇక వెళ్లిపోయే ముందు మెరినా నాకు ప్రపోజ్‌ చేసింది. ‘‘ఐ లవ్‌ యూ’’ అని మెరినా చెప్పినప్పుడు నాకు ఈ ప్రపంచాన్నే జయించినంతగా సంబరపడిపోయాను. ఆమె నాకు ‘‘ఐ లవ్‌ యూ’’అని చెప్పినప్పుడు నా అనుభూతి గురించి మాటల్లో చెప్పలేను. నా జీవితంలో అదొక మధురమైన క్షణం అనిపించింది. అంతకు మించిన ఆనందం నాకు ఎప్పుడూ కలగలేదు. మనం ప్రేమించిన అమ్మాయి ‘‘ఐ లవ్యూ అని చెబితే ఆ కిక్కే వేరప్పా..అనే స్టైల్లో చెప్పాడా నవ యువకుడు..

ప్రేయసిని చూడటానికి రూ. 30 వేలు అప్పు చేసి ఆస్ట్రేలియా వెళ్లిన ప్రేమికుడు
అలా ఆస్ట్రేలియా వెళ్లిపోతూ నాకు ఐ లవ్యూ చెప్పి వెళ్లిపోయింది. ఆ తరువాత కూడా మేం కాంటాక్ట్‌లోనే ఉన్నాం. ఒకరికొకరం ఉత్తరాలు రాసుకునే వాళ్లం. ఎన్నో ఊసులు ఉత్తరాల్లోనే చెప్పుకునేవాళ్లం. దీంతో ఆమెను చూడాలని తపన పడిపోయేవాడిని. ఏం చేసినా మెరినా మొహమే కనిపించేది. రాత్రి పగలు ఆమె ధ్యాసే. దీంతో ఆమెను చూడకుండా బతకలేనని అనిపించింది. దీంతో ఆమెను చూడాలనే తపనతో 30 వేల రూపాయలు అప్పు చేసి ఆస్ట్రేలియా వెళ్లాను. మూడు నెలలు అక్కడే ఉన్నాను. నా జీవితంలో అత్యంత మధురమైన క్షణాలు ఏమైనా ఉన్నాయి అంటే అవి ఆమెతో గడిపినవే. ఆ మూడు నెలల్లో ఆమె నాకు ఇంగ్లీష్‌ నేర్పింది.నేను ఆమెకు మా భాష నేర్పాను. అలా ఆ మూడు నెలలు మూడు క్షణాల్లా గడిచిపోయాయి. ఎన్నో ఊసులు..మరెన్నో అనుభూతులు ఆ నాటు జ్ఞాపకాలు. ఆ స్వీట్ మెమరీస్ నెమరువేసుకున్నాడా వృద్ధుడు.

అలా మొదలైన ప్రేమ అలా విడిపోవాల్సి వచ్చింది…
‘‘ఆస్ట్రేలియాలో ఉండగా ఓ రోజు మెరినా నాతో ఓ తీయని మాట చెప్పింది. ‘‘ డియర్ మనం పెళ్లి చేసుకుందాం అని. ఆ మాట వినగానే నాకు గాల్లో తేలిపోతున్న అనుభూతి. కానీ ఆ తరువాత ఆమె అన్న మాట పెళ్లి చేసుకున్నాక ‘‘నువ్వు ఇక్కడే ఉండిపో హాయిగా ఉందాం’’ అంది. కానీ అది జరిగే పని కాదు. నా ​కుటుంబాన్ని వదిలి అక్కడే స్థిరపడలేను. అలా అని తను నా కోసం ఆస్ట్రేలియా విడిచి రాలేదు. దాంతో తప్పని సరి పరిస్థితుల్లో మేం విడిపోవాల్సి వచ్చింది.

ఆ తర్వాత కుటుంబ ఒత్తిడి మీద నేను పెళ్లి చేసుకున్నాను. ఈ గేట్‌ కీపర్‌ ఉద్యోగంలో జాయిన్‌ అయ్యాను. మొదట్లో మెరినా గురించి అస్తమానూ ఆలోచించేవాడిని. ఆ తరువాత రోజులు..నెలలు..సంవత్సరాలు గడిచేకొద్దీ అప్పుడప్పుడు మెరినా గురించి ఆలోచించేవాడిని. తనుకూడా నాలాగా వివాహం చేసుకుందా? ఎలా ఉంది? అని ఆలోచించేవాడిని. ఒక్కసారి చూస్తే బాగుండు అనుకునే వాడిని. ఏళ్లు గడిచేకొద్దీ ఆమె ఆలోచనలు కూడా తగ్గిపోయాయి. కానీ మరోసారి ఆమెను కలుసుకోవాలనే నా కోరిక ఇక తీరదు..ఈ జన్మకు ఇంతే అని సరిపెట్టుకున్నాను.

అద్భుతం..జరిగింది..ఆమె నుంచి కబురు వచ్చింది..
‘‘ఇలా ఆమె ఆమె ఆలోచనలు తగ్గిన నా జీవితంలో ఓ అద్భుతం జరిగింది. ఆమె నుంచి కబురు వచ్చింది. అంతే నాలో ఏదో తెలియని ప్రకంపనలు. నెల రోజుల క్రితం మెరినా నాకు ఉత్తరం రాసింది..!! ‘‘ఎలా ఉన్నావ్‌ నేస్తమా’ అంటూ కుశల ప్రశ్నలు వేసింది. ఆ లేఖ చూసి నేను ఎంత ఆశ్చర్యానికి గురయ్యానో..ఎంత సంబర పడిపోయానో మాటల్లో చెప్పలేను. ఇది కలా.. నిజమా అని నన్ను నేను పదేపదే ప్రశ్నించుకున్నాను. దాదాపు 50 ఏళ్ల తర్వాత నేను నా తొలి ప్రేమను ఉత్తరం రూపంలో తిరిగి కలుసుకున్నాను. ఆ తర్వాత నుంచి మేం ప్రతి రోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం’’ అని చెబుతూ తాత తెగ సంబరపడ్డాడు.

తను మాత్రం పెళ్లి చేసుకోలేదు…
‘‘మేం విడిపోయి ఇంతకాలం గడిచినా మెరినాకు వివాహం కాలేదని లెటర్ల ద్వారా తెలిసింది. త్వరలోనే మెరినా ఇండియా రాబోతుంది. ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి నాకు ఎలా ఉందంటే.. కాళ్లూ చేతులు ఆడటంలేదు. అది వయస్సు వల్ల వచ్చింది కాదు. నా తొలిప్రేమను మరోసారి కలుసుకోబోతున్నందకు. దేవుడి మీద ఒట్టు నాకు నేనే 20 ఏళ్ల కుర్రాడిలా అనిపిస్తున్నాను. తనను ఎప్పుడు చూస్తానా అని మనసు ఒక్కటే ఉవ్విళ్లురూతోంది. ఆ మధురమైన క్షణాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నా.. మా భవిష్యత్‌ ఎలా ఉండనుందో నాకు తెలియదు. కానీ.. నా ఫస్ట్‌ లవ్‌, నా తొలి ప్రేమని తిరిగి కలుసుకోబోతున్నాను. ఈ అనుభూతి నన్ను కుదురుగా ఉండనీయటం లేదు.

తను తిరిగి నా జీవితంలోకి రాబోతుంది. తనతో ప్రతి రోజు మాట్లాడటం ఎంత సంతోషంగా ఉందో మాటాల్లో వర్ణించలేను’’ అని చెబుతూ 82 ఏళ్ల తాత తెగ సంబరపడిపోతున్నాడు. ఇదిగో మెరినాతో నేను స్థలాలు అన్నీ తిరుగుతున్నాను. ఒక్కో ప్లేసులో ఒక్కో అనుభూతిని గుర్తుచేసుకుంటున్నాను. ఆమెకు నేను ఒంటెను నడపిన క్షణాలను గుర్తుచేసుకుంటున్నా. హ్యూమన్స్‌బాంబే తన సోషల్ మీడియాలో షేర్‌ చేసిన ఈ అరుదైన ‘‘లవ్ స్టోరి’ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ట్రూ లవ్‌.. ఫస్ట్‌ లవ్‌ ఎఫెక్ట్‌ ఇదే..నిజమైన ప్రేమంటే ఇదే అంటున్నారంతా.