Maharashtra : 78 ఏళ్ల భార్య వేధింపులపై కోర్టుకెక్కిన 83 ఏళ్ల వ్యక్తి..భర్తకు భరణం ఇవ్వాల్సిందేనని కోర్టు తీర్పు

83 ఏళ్ల వృద్ధుడు తన 78 ఏళ్ల భార్య తనను వేధిస్తోందని..ఆమెనుంచి తనకు విడాకులు ఇప్పించాలని కోర్టును ఆశ్రయించాడు. విడాకులతో పాటు భరణం ఇప్పించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించగా..విడాకులతో పాటు భర్తకు భరణం కూడా ఇవ్వాలని తీర్పునిచ్చింది.

Maharashtra : 78 ఏళ్ల భార్య వేధింపులపై కోర్టుకెక్కిన 83 ఏళ్ల వ్యక్తి..భర్తకు భరణం ఇవ్వాల్సిందేనని కోర్టు తీర్పు

Pune Family Court Ordered That Maintenance Should Be Given To The Husband

Pune court ordered maintenance be given to the husband : భర్త పెట్టే హింసలు భరించలేక విడాకుల కోసం కోర్టుకెక్కిన భార్యల గురించి విన్నాం. విడాకులు తీసుకుంటు భరణం కోసం డిమాండ్ చేసే సందర్భాల గురించి తెలిసిందే. కోర్టులు కూడా భరణం ఇప్పించే విషయంలో తీర్పులు బాధితుల తరపున ఇస్తుంటాయి. మహారాష్ట్రలోని పుణె ఫ్యామిలీ కోర్టు భిన్నమైన తీర్పు ఇచ్చింది. భార్యే భర్తకు భరణం ఇవ్వాలని తీర్పునిచ్చింది. పైగా 78 ఏళ్ల భార్య 83 ఏళ్ల భర్తకు నెలకు రూ.25వేలు భరణంగా ఇవ్వాలని ఆదేశించింది. సదరు వృద్ధ జంటకు విడాకులు మంజూరు చేస్తూనే.. భర్తకు భార్య నెల నెలా రూ.25 వేలు భరణంగా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

పుణెకు చెందిన 83 ఏళ్ల వృద్ధుడు తన 78 ఏళ్ల భార్య తనను వేధిస్తోందని..మనశ్శాంతి లేకుండా చేస్తోందని దయచేసిన ఆమెనుంచి తనకు విడాకులు ఇప్పించాలని పైళ్లి జరిగిన 55 ఏళ్లకు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. విడాకులతో పాటు భరణం ఇప్పించాలని కోరుతూ 2019లో ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. తమ వివాహమై 55 ఏళ్లు అయిందని..ఇన్నేళ్లుగా తాను భార్య వేధింపుల్ని భరిస్తునే ఉన్నానని ఇక ఈ వృద్ధాప్యంలో తను ఆవేధింపుల్ని భరించలేకపోతున్నానని దయచేసిన నాకు భరణంతో కూడిన విడాకులుఇప్పించాలని కోరాడు.

దీనిపై కోర్టు విచారణ జరిపిన ఫ్యామిలో కోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. ఆ వృద్ధ జంటకువిడాకులు మంజూరు చేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘తప్పు ఎవరి వైపు ఉన్నా తప్పేనని.. సంపాదన, విడాకుల విషయంలో స్త్రీపురుష భేదం చూపించాల్సిన అవసరం లేదు’ అని పేర్కొంది. ఇన్నాళ్లు భర్తను మానసిక క్షోభకు గురించిన భార్య ప్రతినెలా రూ.25 వేల చొప్పున భర్తకు భరణంగా ఇవ్వాలని ఆదేశించింది.

‘‘హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం.. భార్యా భర్తల మధ్య గొడవ వచ్చినప్పుడు విడాకులు మంజూరు చేయవచ్చు. అందులో భార్యకు ఆదాయం ఉండి భర్తకు ఎలాంటి ఆదాయ మార్గం లేనప్పుడు సదరు భార్య నుంచి భర్త భరణాన్ని కోరవచ్చు. భార్యలే కాదు బాధిత భర్తలు కూడా సమాన న్యాయాన్ని పొందవచ్చని ఈ కేసులో కోర్టు తీర్పు స్పష్టం చేస్తోంది..” అని పిటిషనర్ తరఫు న్యాయవాది వైశాలి చండే అన్నారు.