Corona Cases : దేశంలో కొత్తగా 8,603 కరోనా కేసులు..415 మరణాలు

దేశంలో కొత్తగా 8,603 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా వైరస్ బారిన పడి 415 మంది మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Corona Cases : దేశంలో కొత్తగా 8,603 కరోనా కేసులు..415 మరణాలు

Corona

new corona cases in india : దేశంలో కొత్తగా 8,603 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో వైరస్ బారిన పడి 415 మంది మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 99,974 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశంలో 0.29 శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 3,46,24,360 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

దేశవ్యాప్తంగా మొత్తం 4,70,530 మరణాలు నమోదు అయ్యాయి. దేశంలో కరోన రికవరీ రేటు 98.35 శాతంగా ఉంది. నిన్న కరోనా నుంచి 8,190 మంది కోలుకుని, డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు కరోనా నుంచి 3,40,53,856 మంది కోలుకున్నారు. దేశంలో మార్చి 2020 తరువాత రికవరీ కేసుల శాతం భారీగా పెరిగింది.

మరోవైపు భారత్ లోకి ఎంటర్ అయిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కు సంబంధించి ఢిల్లీలో కూడా కల కలం రేపుతోంది. ఇప్పటికే విదేశాల నుంచి వచ్చిన 12 మందిలో ఢిల్లీకి వచ్చిన 10 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మరో ఇద్దరికి టెస్టులు జరగాల్సివుంది. ఈ 10 మంది శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు అధికారులు పంపారు.

కరోనా బాధితులను లోక్ నాయక్ ఆస్పత్రికి తరలించారు. లోక్ నాయక్ ఆస్పత్రిని ప్రత్యేకించి కోవిడ్ కే కేటాయించారు. ఈ ఆస్పత్రిలో వీరికి ట్రీట్ మెంట్ అందుతోంది. జీనోమ్ సీక్వెన్సింగ్ లో వీరికి సోకింది ఒమిక్రాన్ వేరియంట్ అయితే కచ్చితంగా ఢిల్లీ కూడా అప్రమత్తం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది

ప్రపంచానికి ఒమిక్రాన్ భయం పట్టుకుంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ కొత్త వేరియంట్ ప్రపంచ దేశాలకు పాకుతోంది. దక్షిణాఫ్రికాలో చిన్నారులు సైతం ఈ వైరస్ బారిన పడుతుండడం వైద్యులను ఆందోళన కలిగిస్తోంది. బ్రిటన్, హాంకాంగ్, ఆస్ట్రేలియా, బెల్జియం, ఇంగ్లండ్, ఇటలీ, జర్మనీ, నెదర్లాండ్స్ లలో వేరియంట్ బయటపడింది. భారత్ లోనూ..ఒమిక్రాన్ వేరియంట్ పై ఆందోళన మొదలైంది. తాజాగా..కెనాడలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగు చూసింది.