ఐఎస్‌ఐ కుట్ర భగ్నం : 9 మంది ఉగ్రవాదుల అరెస్ట్ 

  • Published By: veegamteam ,Published On : January 23, 2019 / 09:45 AM IST
ఐఎస్‌ఐ కుట్ర భగ్నం : 9 మంది ఉగ్రవాదుల అరెస్ట్ 

మహారాష్ట్ర  : పాకిస్థాన్ ఐఎస్‌ఐతో సంబంధం ఉన్న 9 మందిని ఉగ్రవాదులను ఏటీఎస్ అరెస్టు చేసింది.  భారీ దాడులకు పాల్పడేందుకు సిద్ధమవుతున్న ఉగ్రవాదుల కుట్రను యాంటీ టెర్రరిస్ట్ స్వాడ్ భగ్నం చేసింది. నిఘా వర్గాలందించిన సమాచారం మేరకు గత కొంతకాలంగా అనుమానితులపై నిఘా వేసిన ఏటీఎస్‌ 12 ప్రత్యేక బృందాలతో థానే జిల్లాలోని ముంబ్రా, ఔరంగాబాద్‌ సహా ఐదుచోట్ల ఏకకాలంలో దాడులు చేపట్టింది. ఈ క్రమంలో జరిపిన దాడుల్లో ఔరంగాబాద్ నుంచి నలుగురు, ముంబ్రా, థానే నుంచి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఐదుగురు 17 నుంచి 35 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం. 

‘మాకు సమాచారం అందేసరికే ఈ  ముఠా దాడులకు సిద్ధమైందనీ..అందుకే స్పెషల్ టీమ్ లను ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాలలోను ఏకకాలంలో దాడులు నిర్వహింకటంతో వారిని పట్టుకోగలిగామని…వారి వద్ద నుంచి ప్రమాదకరమైన రసాయనాలు, పౌడర్, మొబైల్ ఫోన్లు, హార్డ్ డ్రైవ్‌లు, సిమ్ కార్డులు, యాసిడ్ బాటిల్, పదునైన కత్తులు స్వాధీనం చేసుకున్నామనీ  ఏటీఎస్‌ ప్రకటించింది.