Covid Cases: మహారాష్ట్రలో ఒకే ఒక్క రోజులో 1,115 కరోనా కేసులు.. 9 మంది మృతి

దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న ఢిల్లీలోనూ 980 కరోనా కేసులు నమోదయ్యాయి.

Covid Cases: మహారాష్ట్రలో ఒకే ఒక్క రోజులో 1,115 కరోనా కేసులు.. 9 మంది మృతి

Covid-19 Cases

Covid Cases: మహారాష్ట్ర (Maharashtra)లో కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి. ఆ రాష్ట్రంలో ఒక్క రోజులో కొత్తగా 1,115 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే, గత 24 గంటల్లో తొమ్మిది మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం బులెటిన్ లో వివరాలు తెలిపింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 5,421 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ముంబైలో 1,577 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు చెప్పారు. దీంతో ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 81,52,291కి పెరిగింది. కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,48,470కు ఎగబాకింది. అందులో ముంబైలోనే 19,752 మంది మృతి చెందారు. దేశంలో కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి.

ఒమిక్రాన్ (Omicron) సబ్ వేరియంట్ XBB.1.16 వేగంగా వ్యాప్తి చెందుతోంది. అయితే, ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య మాత్రం తక్కువగానే ఉంటుంది. తదుపరి 10-12 రోజుల పాటు కరోనా కేసులు పెరుగుతూనే ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. దేశంలో కరోనా ఎండమిక్ దశలో ఉందని అంటున్నారు. కాగా, దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న ఢిల్లీలోనూ 980 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో నిన్న కొత్తగా 7,830 కరోనా కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 40,215గా ఉన్నాయి.

Covid-19 Cases: భారత్‌లో కొనసాగుతున్న కోవిడ్ విజృంభణ.. 40వేలు దాటిన క్రియాశీలక కేసులు.. కొత్త కేసులు ఎన్నంటే?