Tarun Chugh : తొమ్మిదేళ్ల బీజేపీ పాలన సేవా, సుపరిపాలన, పేదల సంక్షేమం పేరుతో దేశ వ్యాప్తంగా ర్యాలీలు : తరుణ్ చుగ్
దేశవ్యాప్తంగా 500 పైగా భారీ సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశంలోని అన్ని ప్రాంతాలకు రిపోర్ట్ కార్డుతో ప్రజల ముందుకు, మీడియా ముందుకు వెళ్తున్నామని చెప్పారు.

Tarun Chugh
Tarun Chugh – BJP Rallies : తొమ్మిదేళ్ల బీజేపీ పాలన సేవా, సుపరిపాలన, పేదల సంక్షేమం పేరుతో దేశ వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించనున్నట్లు బీజేపీ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ పేర్కొన్నారు. రాజస్థాన్ నుంచి ప్రచార ర్యాలీలు మొదలు కానున్నట్లు తెలిపారు. రేపు (బుధవారం) రాజస్థాన్ అజ్మీర్ (Ajmer) నుంచి ప్రచార కార్యక్రమాన్ని ప్రధాని మోదీ (PM Modi) మొదలుపెట్టనున్నారని పేర్కొన్నారు. జేపీనడ్డా (JP Nadda), అమిత్ షా (Amit Shah) సహా పలువురు క్యాబినెట్ మంత్రులు, బీజేపీ సీనియర్ నేతలు పాల్గొననున్నట్లు వెల్లడించారు.
దేశవ్యాప్తంగా 500 పైగా భారీ సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశంలోని అన్ని ప్రాంతాలకు రిపోర్ట్ కార్డుతో ప్రజల ముందుకు, మీడియా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. 5 లక్షల మంది ప్రముఖులు, స్వాతంత్ర్య సమరయోధుల దగ్గరకు పార్టీ నేతలు, ఎంపీలు వెళ్లనున్నారు. 144 క్లస్టర్లుగా విభజించి ప్రతి క్లస్టర్ లో 3 నుంచి 4 లోక్ సభ స్థానాలు ఉండేలా ప్రణాళిక చేసినట్లు తెలిపారు. క్లస్టర్ల వారీగా 9 ఏళ్ల పాలనపై ప్రచారం చేయనున్నట్లు పేర్కొన్నారు.
Wrestlers Protest: ప్రధాని, రాష్ట్రపతి స్పందించకపోతే మెడల్స్ గంగలో విసిరేస్తాం
ప్రతి లోక్ సభ నియోజకవర్గం కనీసం 1000 మంది ప్రముఖులను కలిసి 9 ఏళ్ల పాలన విజయాలను వివరించనున్నామని తెలిపారు. ప్రతి లోక్ సభ నియోజకవర్గానికి ఒక ప్రముఖమైన అభివృద్ధి కార్యక్రమాన్ని చెప్పటం, దాని ఆధారంగా స్థానిక ప్రచార కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. జూన్ 3 నుంచి జూన్ 30 వరకు బూత్ స్థాయిలో ప్రతి ఇంటికి బీజేపీ శ్రేణులు వెళ్లనున్నాయని తెలిపారు.
యువత, మహిళలు ఇలా అన్ని రంగాల ప్రజలను కలిసేందుకు సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు.
10 లక్షల మంది కార్యకర్తలతో డిజిటల్ ర్యాలీ (Digital Rally) నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 16 లక్షల మంది కార్యకర్తలతో నేరుగా ప్రజలతో మమేకం కానున్నామని తెలిపారు. వచ్చే నెల రోజుల్లో ప్రతి బీజేపీ కార్యకర్త ప్రతి ఒక్కరినీ కలుసుకుంటారని వెల్లడించారు. బీజేపీ 9 ఏళ్ల పాలనను సమర్ధించేవారు మిస్ కాల్ ఇవ్వడం కోసం ప్రత్యేకంగా నెంబర్(9090902024)ను బీజేపీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
2024 ఎన్నికలు లక్ష్యంగా బీజేపీ కార్యక్రమాలు రూపొందించినట్లు పేర్కొన్నారు.
Gulf Countries Rs.2,000 Note : రూ.2వేల నోట్లు వద్దంటున్న గల్ఫ్ అధికారులు .. ఆందోళనలో భారతీయులు
దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన రోజు, శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి నాడు ప్రత్యేక కార్యక్రమాలు ఉండనున్నాయని తెలిపారు. ప్రతి ఎంపీ సొంత నియోజకవర్గం కాకుండా తనకి కేటాయించిన నియోజకవర్గంలో కనీసం 8 రోజులు పనిచేయాల్సి ఉంటుందన్నారు. 9 ఏళ్లలో మోదీ నేతృత్వంలో అవినీతి రహిత పాలన అందిస్తున్నామని చెప్పారు. కేంద్రం రూపాయి పంపిస్తే ప్రజలకు రూపాయి అందుతుందన్నారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రూపాయి పంపిస్తే 14 పైసలు మాత్రమే ప్రజలకు చేరేదని గుర్తు చేశారు.
9 ఏళ్లలో అనేక మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. అయోధ్య నిర్మాణం పూర్తి కావస్తోందని, త్రిబుల్ తలాక్ రద్దు చేశానమి పేర్కన్నారు. ఉగ్రవాద దాడులు జరిగితే తెల్ల జెండా చూపించి క్రికెట్ మ్యాచ్లు నిర్వహించే ప్రభుత్వం తమది కాదని, తమది సర్జికల్ స్ట్రైక్స్ చేసే ప్రభుత్వం అని పేర్కొన్నారు. విద్య, వైద్య, మౌలిక సదుపాయాల్లో గుణాత్మక మార్పు తీసుకొచ్చామని తెలిపారు. కోట్లాది మంది పేదల సొంత ఇంటికల ఇలా ఎన్నో చేశామని చెప్పారు.