దేశంలో 90 కోట్ల మంది ఓటర్లు 

  • Published By: chvmurthy ,Published On : March 10, 2019 / 12:13 PM IST
దేశంలో 90 కోట్ల మంది ఓటర్లు 

ఢిల్లీ : స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఏర్పాట్లు చేసినట్లు సీఈసీ సునీల్‌ ఆరోరా తెలిపారు. 17వ ఎన్నికల షెడ్యూల్‌ ఖరారు చేసేముందు అన్ని రాష్ట్రల సీఈవోలతో సమీక్షలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.  17 వ లోక్ సభ కు ఎన్నికలు నిర్వహించేందుకు పరీక్షలు, పండుగలు, పంట సమయాలు వంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నామన్నారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలన్న ఆయన ప‍్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాలకు భారత్‌ దిక్సూచిగా ఆయన అభివర్ణించారు.  

దేశవ్యాప్తంగా 90 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, 2014 నుంచి ఇప్పటివరకూ 8.4 కోట్ల మంది కొత్త ఓటర్లు నమోదు అయినట్లు చెప్పారు. వీరిలో 18-19 ఏళ్ల మద్య వయస్కులు  కోటి 50 లక్షల మంది ఉన్నారని ఆయన చెప్పారు. ఓటర్‌ సిప్ల్‌లు ఎన్నికలు అయిదు రోజులకు ముందే పంపిణీ చేయాలని సూచించారు. దేశవ్యాప్తంగా 10  లక్షల పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేశామని, అలాగే 1950 టోల్‌ ఫ్రీ నంబర్‌ ద్వారా ఓటు చెక్‌ చేసుకోవచ్చని తెలిపారు. అన్ని పోలింగ్‌ స్టేషన్లలో వీవీ ప్యాట్‌లు ఉపయోగిస్తామన్నారు. తుది జాబితా ప్రకటించాక ఓటర్ల జాబితాలో ఇక మార్పులుండని, దేశవ్యాప్తంగా ఎన్నికల కోట్‌ నేటి నుంచి అమల్లో ఉంటుందని వెల్లడించారు. ఓటర్‌ కార్డుతో పాటు 11 రకాల కార్డులకు అనుమతి ఇస్తామని తెలిపారు.

ఎన్నికల ఖర్చుకు సంబంధించి నిఘా కోసం ఎస్పీలు, కలెక్టర్లతో సదస్సులు నిర్వహిస్తామని సీఈసీ పేర్కొన్నారు. ఎన్నికల తేదీలు ప్రకటించే ముందు విద్యార్థుల పరీక్షలకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, ఎన్నికల తేదీలు నిర్ణయించడానికి ముందు వాతావరణ శాఖ నుంచి నివేదికలు తెప్పించుకున్నామన్నారు.