Uttarpradesh : 90 ఏళ్ల వయస్సున్న తండ్రికి పెళ్లి చేయించిన కూతుళ్లు!

అతనికి 90 ఏళ్లు. చాలాకాలం క్రితమే భార్య చనిపోయింది. ఇతనికి ఐదుగురు కుమార్తెలు. పిల్లలందరి పెళ్లిళ్లు చేయడంతో..వారంతా అత్తగారింటికి వెళ్లిపోయారు. దీంతో అతను ఒంటరివాడయ్యాడు.

Uttarpradesh : 90 ఏళ్ల వయస్సున్న తండ్రికి పెళ్లి చేయించిన కూతుళ్లు!

Up

90 Years Old Man Marries : అతనికి 90 ఏళ్లు. చాలాకాలం క్రితమే భార్య చనిపోయింది. ఇతనికి ఐదుగురు కుమార్తెలు. పిల్లలందరి పెళ్లిళ్లు చేయడంతో..వారంతా అత్తగారింటికి వెళ్లిపోయారు. దీంతో అతను ఒంటరివాడయ్యాడు. కుమార్తెలు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఒంటరివాడిగా ఉన్న తండ్రికి వివాహం చేయాలని భావించారు. 75 ఏళ్ల వయస్సున్న ఆమెతో పెళ్లి జరిపించారు. దీనికి సంబంధించిన న్కూస్ సోషల్ వీడియాలో వైరల్ గా మారింది. వీరి నిర్ణయాన్ని పలువురు నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

Read More : మూడు రోజుల పాటు భారీ వర్ష సూచన

జనపథ్ రామ్ పూర్ పరిధిలో షఫీ అహ్మద్ (90) నివాసం ఉంటున్నారు. ఇతనికి ఐదుగురు కుమార్తెలు. వ్యాపారం చేస్తూ…కుటుంబాన్ని నెట్టుకొచ్చాడు. భార్య చాలాకాలం క్రితమే చనిపోయింది. ఐదుగురు కూతుళ్లకు వివాహం జరిపించి…అత్తగారింటికి పంపించాడు. తండ్రి ఒంటరివాడు కావడం…కూతుళ్లు భరించలేకపోయారు. ఆయనకు వివాహం జరిపించాలని వారంతా నిర్ణయం తీసుకున్నారు. ఓ 75 ఏళ్ల వయస్సున్న ఆమెతో వివాహం జరిపించారు. చివరి దశలో తన తండ్రిని జాగ్రత్తగా చూసుకుంటుందని ఇలా చేయడం జరిగిందని కూతుళ్లు వెల్లడిస్తున్నారు. వీరికి సోషల్ మీడియాలో అభినందిస్తున్నారు.

Read More : Brothals Arrest : వ్యభిచార గృహంపై పోలీసుల దాడి : 10 మంది యువతులతో సహా 23 మంది అరెస్ట్