UP : వృద్ధుడి కాళ్లు కట్టేసి చికిత్స..అమానవీయం

92 ఏళ్ల వృద్ధుడి కాళ్లను గొలుసులతో బంధించి..మంచానికి కట్టేశారు. ఈ అమానవీయ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఈటాలో చోటు చేసుకుంది.

UP : వృద్ధుడి కాళ్లు కట్టేసి చికిత్స..అమానవీయం

Up

92 year old prisoner : అతనో ఖైదీ..అందులో వృద్ధుడు. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగానో..వయస్సు రీత్యా..శ్వాస సంబంధిత సమస్యలు వచ్చాయి. ఇతనికి చికిత్స ఎలా చేస్తారు ? ఇదే ప్రశ్న. అందరిలాగానే చికిత్స అందిస్తారు కదా. కానీ.. ఆ 92 ఏళ్ల వృద్ధుడి కాళ్లను గొలుసులతో బంధించి..మంచానికి కట్టేశారు. ఈ అమానవీయ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఈటాలో చోటు చేసుకుంది.

హత్య కేసులో 92 సంవత్సరాలున్న వృద్ధుడు ఈటా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే..సాధారణ శ్వాస సంబంధిత సమస్యలు రావడంతో కారాగార ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వైద్యులు ఆలీఘర్ ఆసుపత్రికి సిఫార్సు చేశారు. అయితే..అక్కడ బెడ్స్ ఖాళీగా లేకపోవడంతో…తిరిగి ఈటా జైలుకు తీసుకొచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది.

అక్కడి సిబ్బంది వృద్ధుడి కాళ్లను గొలుసులతో బంధించి..మంచానికి కట్టేశారు. ఎక్కడైనా పారిపోతారా ? అనే అనుమానంతో కట్టేసినట్లు ఉంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జైళ్ల శాఖ ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. ఈటా జైలు వార్డెన్ అశోక్ యాదవ్ ను సస్పెండ్ చేశారు.

Read More : Telangana : చికిత్స కోసం వస్తున్నారా..అనుమతి తప్పనిసరి