UP Minister On Fuel Price Hike : 95శాతం మందికి పెట్రోల్ అవసరమే లేదన్న యూపీ మంత్రి

దేశంలోని 95శాతం మందికి అసలు పెట్రోలే అవసరం లేదంటూ యూపీ మంత్రి ఉపేంద్ర తివారి వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్‌లో జలాన్‌లో గురువారం మంత్రి ఉపేంద్ర తివారీ విలేఖరులతో మాట్లాడారు.

UP Minister On Fuel Price Hike : 95శాతం మందికి పెట్రోల్ అవసరమే లేదన్న యూపీ మంత్రి

Fuel

UP Minister On Fuel Price Hike దేశంలోని 95శాతం మందికి అసలు పెట్రోలే అవసరం లేదంటూ యూపీ మంత్రి ఉపేంద్ర తివారి వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్‌లో జలాన్‌లో గురువారం మంత్రి ఉపేంద్ర తివారీ విలేఖరులతో మాట్లాడారు. ఈ సమావేశంలో పెరుగుతున్న పెట్రోల్,డీజిల్ ధరలపై అడిగిన ప్రశ్నకు..దేశంలో పెట్రోల్, డీజీల్ ధరలు పెరుగుతున్న మాట వాస్తవమే కానీ ఫోర్ వీలర్ కలిగి ఉన్న కొంత మందికే పెట్రోల్ అవసరముందని సమాధానమిచ్చారు. ప్రస్తుతం సమాజంలోని 95 శాతం జనాభాకు పెట్రోల్ అవసరమే లేదన్నారు.

అంతేకాకుండా పెరిగిన ధరలను ఆయన సమర్థించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం ఉచితంగా కరోనా వ్యాక్సిన్ లను పంపిణీ చేస్తున్నదని, వంద కోట్ల డోసులను పంపిణీ చేసిందని మంత్రి తివారీ అన్నారు. అంతేకాదు, ఉచితంగా కరోనా చికిత్స, ఉచితంగా మందులను అందించిందని వివరించారు. ప్రతి ఇంటికి మెడిసిన్స్ సరఫరా చేసిందని పేర్కొన్నారు. ఇవన్నీ ప్రభుత్వం ఎలా భరిస్తుందని ప్రశ్నించారు.

ప్రతిపక్షాలకు ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడానికి ఏ ఇష్యూ లేకపోయేసరికి ఇంధనలు పెరిగాయని గగ్గోలు పెడుతున్నారన్నారు. ప్రతిపక్షాలు దమ్ముంటే దేశ తలసరి ఆదాయం గురించి మాట్లాడాలన్నారు. 2014కి ముందు ఈ దేశ తలసరి ఆదాయం ఎంత ఉండేదో, ఇప్పుడు ఎంత ఉందో చెప్పాలన్నారు. మోదీ, యోగీ వల్ల దేశంలో తలసరి ఆదాయం రేటు గణనీయంగా పెరిగిందని మంత్రి ఉపేంద్ర తివారి అన్నారు.

కాగా.ఇటీవల కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి కూడా ఇదే తరహాలో స్పందించారు. ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తున్నామని, వాటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు.

ALSO READ Covid Booster Shot : కోవిడ్ బూస్టర్ డోస్ పై పూనావాలా కీలక వ్యాఖ్యలు