Covid Jab : ఒక్కరోజే 96లక్షల మందికి టీకాలు.. వ్యాక్సినేషన్‌లో భారత్‌ మరో మైలురాయి

కరోనా వ్యాక్సినేషన్‌లో భారత్‌ మరో మైలురాయిని అధిగమించింది. శుక్రవారం(ఆగస్టు 27,2021) ఒక్కరోజే 96లక్షల మందికి టీకాలు పంపిణీ చేశారు. ఒక్కరోజుల్లో ఇంతమందికి టీకాలు ఇవ్వడం ఇదే తొలిసారి

Covid Jab : ఒక్కరోజే 96లక్షల మందికి టీకాలు.. వ్యాక్సినేషన్‌లో భారత్‌ మరో మైలురాయి

Covid Jab

Covid Jab : కరోనా వ్యాక్సినేషన్‌లో భారత్‌ మరో మైలురాయిని అధిగమించింది. శుక్రవారం(ఆగస్టు 27,2021) ఒక్కరోజే 96లక్షల మందికి టీకాలు పంపిణీ చేశారు. ఒక్కరోజుల్లో ఇంతమందికి టీకాలు ఇవ్వడం ఇదే తొలిసారి.

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్షుఖ్ మాండవీయ ఈ విషయాన్ని ట్విట్టర్ లో తెలిపారు. దేశ పౌరులకు ఆయన కంగ్రాట్స్ చెప్పారు. కొవిన్ పోర్టల్ లో డేటా ప్రకారం ఒక్కరోజే 96లక్షల 43వేల 30మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. దేశ పౌరులకు కంగ్రాట్స్. ఒక్క రోజే రికార్డులో స్థాయిలో 90లక్షల మంది టీకాలు తీసుకున్నారు అని ఆయన ట్వీట్ చేశారు.

కాగా, ఇప్పటివరకు 62 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. టీకా కార్యక్రమంలో వేగం పెరగడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది. చాలా రాష్ట్రాలు స్కూళ్లు తెరిచేందుకు నిర్ణయం తీసుకున్న వేళ.. కీలక సూచనలు చేసింది. సెప్టెంబర్‌ 5లోగా వ్యాక్సినేషన్‌ పూర్తిచేయాలని.. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ఇందుకోసం అన్ని రాష్ట్రాలకు అదనంగా 2 కోట్ల డోసులు పంపినట్లు తెలిపింది. టీచర్స్‌ డే కంటే ముందుగానే లక్ష్యాన్ని పూర్తి చేయాలని కోరింది.

కొవిన్ పోర్టల్ లోని డేటా ప్రకారం.. 14కోట్ల మందికి పైగా ప్రజలు వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారు. ఆగస్టు 16న 88.13 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. భారత వ్యాక్సినేషన్ లో అదో మైలురాయి. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. 18ఏళ్లు పైబడిన వారందరికి కేంద్రం ఉచితంగా టీకాలు ఇస్తోంది. అంతేకాదు నేరుగా వ్యాక్సిన్ తయారీ కంపెనీల నుంచి కేంద్రం 75శాతం టీకాలు కొనుగోలు చేస్తోంది. 25శాతం రాష్ట్రాలకు ఇచ్చింది. మరో 25శాతం ప్రైవేటు ఆసుపత్రులు కొంటున్నాయి.

మరోవైపు దేశంలో అర్హులైన పెద్దల్లో (18 ఏళ్లు పైబడిన వారు) సగం మందికి పైగా సింగిల్ డోసు వ్యాక్సిన్ తీసుకున్నట్టు అధికార గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో హెల్త్ కేర్ వర్కర్లు 99 శాతం, ఫ్రంట్ లైన్ వర్కర్లు 100 శాతం ఉన్నారు. 60 ఏళ్లకు పైబడిన వారిలో కనీసం ఒక్క విడత వ్యాక్సిన్ డోస్ అయినా తీసుకున్న వారు 60 శాతం ఉన్నారు. ప్రస్తుతం 47.3 కోట్ల మంది తొలి డోసు వ్యాక్సిన్ తీసుకోగా, రెండో విడత వ్యాక్సిన్ కూడా తీసుకున్న వాళ్లు 13.8 కోట్లకు చేరారు. కోరనా మూడో వేవ్‌ రాకుండా నిరోధించే ప్రయత్నాల్లో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసిన నేపథ్యంలో ఈ గణాంకాలను ఆరోగ్య శాఖ మంత్రి మన్షుఖ్ మాండవీయ ఓ ట్వీట్‌లో తెలిపారు.

”భారత్ మరో గొప్ప మైలురాయిని చేరుకుంది. అర్హులైన వారిలో 50 శాతానికి పైగా ప్రజలు కోవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు వేయించుకున్నారు. కీపిటప్ ఇండియా…కరోనాతో కలిసి పోరాడదాం” అని ఆ ట్వీట్‌లో మంత్రి తెలిపారు. ఆరోగ్య శాఖ డాటా ప్రకారం, వ్యాక్సినేషన్ డ్రైవ్ మూడో దశ ప్రారంభమైనప్పటి నుంచి 18 నుంచి 44 ఏళ్ల లోపు వారు 23,18,95,731 మంది మొదటి డోసు తీసుకోగా, రెండో డోసు కూడా వేయించుకున్న వారు 2,33,74,357 మంది ఉన్నారు. ఈ ఏడాది చివరి కల్లా దేశంలోని అందరికీ వ్యాకినేషన్ అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.