Vaccination : రెండు డోసుల టీకాతో 98% మరణం నుంచి రక్షణ

కోవిద్ - 19 టీకా సామర్థ్యంపై పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా చండీఘర్ లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పిజిఐఎంఆర్) పరిశోధకులు టీకాల పనితీరుపై అధ్యయనం చేశారు. ఈ అధ్యయనం ప్రకారం ఒక్క డోస్ తీసుకున్న వారికి 92%, రెండు డోసులు తీసుకున్న వారికి 98% మరణం నుంచి రక్షణ లభిస్తుందని వెల్లడించారు.

Vaccination : రెండు డోసుల టీకాతో 98% మరణం నుంచి రక్షణ

Vaccination (4)

Vaccination : కోవిద్ – 19 టీకా సామర్థ్యంపై పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా చండీఘర్ లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పిజిఐఎంఆర్) పరిశోధకులు టీకాల పనితీరుపై అధ్యయనం చేశారు. ఈ అధ్యయనం ప్రకారం ఒక్క డోస్ తీసుకున్న వారికి 92%, రెండు డోసులు తీసుకున్న వారికి 98% మరణం నుంచి రక్షణ లభిస్తుందని వెల్లడించారు.

పంజాబ్ పోలీసుల్లో టీకా తీసుకోని వారు, మొదటి డోస్ తీసుకున్న వారు, రెండవ డోస్ తీసుకున్న వారు అనే మూడు గ్రూపులుగా విభజించి అధ్యయనం చేశారు. ఇందులో టీకా తీసుకోని వారు 4,868 మంది ఉండగా వీరిలో కరోనా బారినపడి 15 మంది మృతి చెందారు. ఇక మొదటి డోస్ తీసుకున్న వారు 35,856 మంది ఉండగా వీరిలో 9 మంది మృతి చెందారు. రెండు డోస్ లు తీసుకున్న వారు 42,720 ఉండగా వారిలో ఇద్దరు మాత్రమే మృతి చెందారు. వ్యాక్సిన్ తీసుకోవడం వలన రోగ తీవ్రత మరణభయం పూర్తిగా తగ్గినట్లు ఈ అధ్యయనంలో తేలింది.

ఇక దేశంలో అందిస్తున్న వ్యాక్సిన్లు సురక్షితమైనవని, అవి ప్రభావంగా పనిచేస్తున్నాయని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ అన్నారు. టీకా పంపిణి గ్రామీణ స్థాయి వరకు చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ మేరకు వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచినట్లు వివరించారు.