Cocaine Seized : ముంబై ఎయిర్‌పోర్ట్‌లో భారీగా కొకైన్‌ పట్టివేత

Cocaine Seized : ముంబై ఎయిర్‌పోర్ట్‌లో భారీగా కొకైన్‌ పట్టివేత

Cocaine Seized

Cocaine Seized :  ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా కొకైన్‌ పట్టుబడింది. విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అడిస్‌ అబాబా నుంచి ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ విమానం ఈటీ-610లో వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి రూ.9.8కోట్ల విలువైన 980 గ్రాముల కొకైన్‌ను సోమవారం స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు.

Delhi : ఢిల్లీ ఎయిర్ పోర్టులో రూ.15 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్

లోదుస్తుల్లో దాచి డ్రగ్స్‌ను తరలిస్తుండగా పట్టుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సదరు వ్యక్తిని అరెస్టు చేసి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.